
తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట.. ఆ పాలపిట్ల రంగు అంటే తెలంగాణ ప్రజలకు ప్రీతిపాత్రం. ప్రతీ దసరాకు పాలపిట్టను చూస్తే ఆ సంవత్సరం అంతా మంచి జరుగుతుందని తెలంగాణ ప్రజలు నమ్ముతారు.ఆ నమ్మకమే పెట్టుబడిగా షర్మిల తన పార్టీ గుర్తును ‘పాలపిట్ట’ రంగుగా గుర్తించారు.
తెలంగాణలో దూకుడుగా ముందుకెళుతున్న వైఎస్ షర్మిల రేపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె జెండా రంగు, తీరు మొత్తం ఇప్పటికే డిసైడ్ అయ్యాయని.. పార్టీ విధివిధానాలు, లక్ష్యాలు కూడా సభావేదికపై నుంచి ప్రకటిస్తారని అంటున్నారు.
జూలై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా షర్మిల కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఈ పార్టీకి వైఎస్ఆర్ టీపీగా నామకరణం చేశారు. కోవిడ్ తీవ్రత కారణంగా లోటస్ పాండ్ నుంచే వైఎస్ షర్మిల పార్టీ పేరును, జెండాను అధికారికంగా ప్రకటించనున్నారు.
వైఎస్ షర్మిల పార్టీకి జెండాను రూపొందించారు. పాలపిట్ల, నీలం రంగులతోపాటు తెలంగాణ రాష్ట్ర మ్యాప్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో ఉండేలా జెండాను రూపొందించినట్టు తెలిసింది. ఈ మేరకు లీక్ అయిన షర్మిల పార్టీ జెండా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.