Homeఎంటర్టైన్మెంట్ప్రభాస్ సినిమాలకు వాటి పైనే ఎక్కువ మోజు !

ప్రభాస్ సినిమాలకు వాటి పైనే ఎక్కువ మోజు !

prabhasనేషనల్ స్టార్ గా గుర్తింపు వచ్చాక ‘ప్రభాస్’ సినిమాల శైలి పూర్తిగా మారిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న మాదిరిగా ప్రభాస్ సినిమాలు సాగుతున్నాయి. పాత కార్లు, పాత బైక్స్ అంటే కొంతమంది ప్రత్యేక ఇష్టం చూపిస్తారు. ఆ రోజుల్లో అంటూ తమ తాతల కాలం నాటి వస్తువులను సొంతం చేసుకుని, ఆ తరం వారి లైఫ్ స్టైల్ లోకి తొంగి చూస్తారు.

అందుకే లక్షలు, కోట్లు పెట్టి వింటేజ్ వెహికిల్స్ కొనడానికి కూడా కొంతమంది ముందుకు వస్తారు. అయితే, హీరో ప్రభాస్ కి నిజజీవితంలో ఈ వింటేజ్ వెహికిల్స్ మోజు లేదు గానీ, తన సినిమాలలో మాత్రం ఈ మధ్య ఎక్కువగా ఆ వింటేజ్ వెహికిల్స్ కే ఎక్కువ ప్రాధ్యానముంటుంది. ప్రభాస్ ప్రస్తుతం షూట్ చేస్తోన్న సినిమాలు ‘రాధే శ్యామ్’, ‘సలార్’.

ముందుగా ‘రాధే శ్యామ్’లోని వింటేజ్ వెహికిల్స్ దగ్గరకు వద్దాం.. 1970లలో జరిగే కథ అట ఇది. అందుకే ఈ సినిమా కోసం ఎక్కువగా అప్పటి కార్లను కొన్నారు. పైగా ఆ కార్లు కొనుగోలు కోసం పెద్ద మొత్తాన్నే పెట్టారు. మొత్తానికి ‘రాధే శ్యామ్’లో ఎక్కువగా ఆనాటి వింటేజ్ కార్లు హైలైట్ అయ్యే విధంగా దర్శనమివ్వబోతున్నాయి.

ఇక ‘సలార్’ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో కూడా అప్పటి వస్తువులనే ఎక్కువగా వాడుతున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా పాతకాలపు బుల్లెట్, ఎన్ ఫీల్డ్ తరహాలో ఒక బైక్ ని డిజైన్ చేయించారు. ఈ సినిమాలో ప్రభాస్ వెహికిల్ గా ఆ వెహికల్ నే వాడుతున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీస్తున్న ఈ మూవీ కూడా గతంలో జరిగిన ఒక యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఈ సినిమాలో కూడా ఎక్కువగా వింటేజ్ వెహికిల్స్ కనిపించనున్నాయి. మొత్తానికి వింటేజ్ వెహికిల్స్ చూడాలంటే సరదగా ప్రభాస్ సినిమాలు చూడొచ్చు అన్నమాట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular