Maoist-affected village: రాజ్యాంగపై, ప్రభుత్వాలపై విశ్వాసం లేక.. దశాబ్దాలుగా నక్సలైట్లు, మావోయిస్టుల పేరుతో ప్రత్యామ్నాయ ఉద్యమాలు నడిపారు. అయితే మొదట్లో ఉద్యమ సిద్దాంతాలు బాగానే ఉన్నాయి. ప్రజలు మద్దతు ఇచ్చారు. కానీ క్రమంగా ఉద్యమ సిద్దాంతం దారితప్పింది. దీంతో ప్రజలు దూరమవూతు వచ్చారు. ప్రస్తుతం సంఘ విద్రోహ శక్తులుగా మారారు. దీంతో కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత చేపట్టింది. చాలా మంది ఎన్‌కౌంటర్‌లో హతమవ్వగా, వందల మంది లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. దీంతో మావోయిస్టుల కారణంగా అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామాల్లో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.
తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామం కొండపల్లి మావోయిస్టు ప్రభావిత గ్రామం. సవంత్సరాలుగా అక్కడ అభివృద్ధి జాడలేదు. ప్రాథమిక వసతులు కూడా లేకుండా ప్రజలు జీవనం సాగిస్తున్నారు. సమస్యలతో సహవాసం చేస్తున్నారు. మావోయిస్టుల అంతంతో ఇప్పుడు ఆ గ్రామంలో అభివృద్ధి ఆశలు చిగురించాయి. చెక్కించిన మావోయిస్టుల కారణంగా అనేక సంవత్సర్లుగా పెడుతూ ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి. ప్రాథమిక వసతులు లేకుండా వింత పరిస్థితుల్లో జీవిస్తున్న ప్రజలకు కొత్త ఆశ కలిగింది.
మొబైల్ సిగ్నల్స్‌తో సంబరాలు
కొండపల్లి గ్రామానికి మొబైల్ టవర్ ఏర్పాటు కావడంతో గ్రామస్తులు సంబరాలు మొదలయ్యాయి. పలువురు దూర ప్రాంత బంధువులతో సంభాషణ జరపడం ప్రారంభించారు, సాంకేతిక పరిజ్ఞానం స్ఫూర్తిగా మారింది. గ్రామానికి రహదారులు, పాఠశాలలు, వైద్య సదుపాయాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాన్ని కొత్త దిశగా నడిపిస్తున్నాయి.
అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు..
తొలి మూడు అగ్రిమెంట్ల ఆధారంగా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న ప్రత్యేక పథకాల ద్వారా కొండపల్లి వంటి గ్రామాలకు సాంకేతిక మరియు మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధికి దారి తీస్తోంది. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు అగ్రిమెంట్లతో తమ భవిష్యత్ మారుతుందని సంబురాలు చేసుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నియాద్ నెల్లార్ వంటి అంటే నా గ్రామము.. నా అభివృద్ధి అనే పథకంలో భాగంగా నక్సల్ ప్రభావిత గ్రామాల్లో కొండపల్లికి మొబైల్ తీసుకువచ్చారు.