Minister Dharmana Prasada Rao: మూడు రాజధానుల వ్యవహారం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇదివరకే దీనిపై ఉద్యమాలు నడుస్తున్నా నేతల్లో మాత్రం మూడు రాజధానులకే మొగ్గు చూపుతున్నట్లు వారి మాటల్లో తెలుస్తోంది. అమరావతి రాజధాని అయితే ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ చంద్రబాబుకు రాష్ట్రంపై ప్రేమ లేదని విమర్శించారు. ఒక అమరావతిపైనే ప్రేమ చూపించడంతో అన్ని ప్రాంతాలు అట్టడుగున ఉండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరోమారు మూడు రాజధానుల వ్యవహారం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ కాలేదని కొందరి వాదన. దీంతోనే మూడు రాజధానుల ప్రస్తావన వచ్చిందని చెబుతున్నారు. రాజధాని కావాల్సిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నాయని వాదిస్తున్నారు. దీంతోనే మూడు రాజధానుల ప్రస్తావన సీఎం జగన్ తీసుకొచ్చినట్లు నేతలు పేర్కొంటున్నారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం దక్కాలనే ఉద్దేశంతోనే జగన్ ఈ మేరకు చర్యలు తీసుకోవాలని భావించారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఒక అమరావతి గురించే పట్టించుకున్నారు కానీ మిగతా ప్రాంతాల ఊసే ఎత్తలేదు.
దీంతోనే మూడు రాజధానుల కోసం పట్టుపడుతున్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే తాము పోరాటం చేస్తున్నామని గుర్తు చేస్తున్నారు. అమరావతి రాజధాని కోసం అక్కడి రైతులు పాదయాత్ర చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మూడు రాజధానుల కోసమే మొగ్గు చూపుతున్నట్లు చెప్పడం గమనార్హం. దీని కోసం కూడా ఉద్యమాలు చేస్తామని ప్రకటిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసమే మూడు రాజధానుల విషయమై నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు సర్కారు తమ సమస్యలను పట్టించుకోలేదంటున్నారు.

జగన్ ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో అభివృద్ధి కనిపించాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల ప్రస్తావన తెస్తున్నా దాన్ని ముందుకు సాగనీయడం లేదు. ఒకపక్క కోర్టు అక్షింతలు వేస్తున్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరించడం ఆందోళనలకు తావిస్తోంది. అమరావతిలో కొందరి ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీని కోసం ఇంకా ఎన్ని పోరాటాలైనా చేయడానికి తాము సిద్ధమేనని వైసీపీ నేతలు చెబుతున్నారు.