Google Chrome: ప్రపంచంలో గూగుల్ క్రోమ్ వినియోగదారులు పెరుగుతున్నారు. గూగుల్ తో ప్రజలు పెనవేసుకుపోతున్నారు. కానీ దీంతో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియా ఎంత ఎదుగుతోందో అంత నష్టాలకు గురవుతూనే ఉంటోంది. హ్యాకర్ల బారిన పడి ఆన్ లైన్ మోసాలకు వెల్లువలా మార్గాలు వస్తున్నాయి. దీంతోనే ప్రజల్లో అభద్రత భావం కనిపిస్తోంది. గూగుల్ క్రోమ్ తో ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉండటం సహజమే. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ హ్యాకింగ్ కు గురయితే వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే అవకాశం ఉంది.

కంప్యూటర్లలో గూఢచర్యంతో మన సాఫ్ట్ వేర్ ను దొంగిలించే ప్రమాదం పొంచి ఉంది. గూగుల్ క్రోమ్ లో వినియోగదారులు కొత్త వెర్షన్ ను అప్ గ్రేడ్ చేసుకోకపోతే మన సమాచారం గల్లంతయ్యే ప్రమాదం ఉంది. దీంతో గూగుల్ క్రోమ్ యూజర్లు సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది. యూజర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత సమాచారం కాపాడుకోవడానికి ఇంకా కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంది. గూగుల్ క్రోమ్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం జాగ్రత్తలు తీసుకుంటోంది.

కంప్యూటర్లలో కొత్త వెర్షన్ అప్ డేట్ కాకపోతే రక్షణ ఉండదు. కంప్యూటర్ లో ఉండే సున్నితమైన సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉంది. అందుకే గూగుల్ క్రోమ్ స్టేబుల్ చానల్ ని విండోస్, మాక్, లినక్స్ కోసం అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. గూగుల్ కొత్త వెర్షన్ను స్ర్కీన్ కుడి వైపున పై భాగంలో అప్ డేట్ పై క్లిక్ చేస్తే సరిపోతోంది. దీంతో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నా సైబర్ నేరగాళ్లకు మాత్రం అన్ని అవకాశాలు దొరుకుతున్నాయి. దీంతోనే మన ఆన్ లైన్ వ్యవహారాల్లో గందరగోళం నెలకొంటోంది.
గూగుల్ క్రోమ్ వాడితే రక్షణ వ్యవస్థ అంతంత మాత్రమే. హ్యాకర్లు సులభంగా మన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంటుంది. అందుకే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మన డివైస్ లను కంట్రోల్ లోకి తెచ్చుకుని మన సమాచారాన్ని దొంగిలించే అవకాశాలు ఉంటున్నాయి. దీంతో మన సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేయించుకోవాలి. హ్యాకర్లకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే భవిష్యత్ లో మనకు మరిన్ని కష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనికి అందరు అప్రమత్తంగా ఉండి మన సాఫ్ట్ వేర్ దొంగతనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంది.