Vijayasai Reddy: ఏపీ ఆర్థికమంత్రిగా విజయసాయిరెడ్డి.. జగన్ సంచలనం?

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే సంకేతాలు ఇవ్వడంతో అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆశావహుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఖాయమని ప్రచారం సాగినా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఇన్నాళ్లు పార్టీ వ్యవహారాలను ఢిల్లీలో చక్కబెట్టే బాధ్యతలు స్వీకరించినా ప్రస్తుతం ఆయన సేవలు రాష్ట్రంలోనే అవసరమని జగన్ భావిస్తున్నట్లు […]

Written By: Srinivas, Updated On : March 14, 2022 11:13 am
Follow us on

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే సంకేతాలు ఇవ్వడంతో అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆశావహుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఖాయమని ప్రచారం సాగినా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

Vijayasai Reddy

ఇన్నాళ్లు పార్టీ వ్యవహారాలను ఢిల్లీలో చక్కబెట్టే బాధ్యతలు స్వీకరించినా ప్రస్తుతం ఆయన సేవలు రాష్ట్రంలోనే అవసరమని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో విజయసాయిరెడ్డిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా నియమించనున్నారని తెలుస్తోంది. దీని కోసమే జగన్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీలో రెండో స్థానంలో కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుని పూర్తిస్థాయిలో ఆయన సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నారు.

Also Read: దేనికైనా సత్తా ఉన్న ఏకైక వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే !

ఇప్పటికి రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొనసాగుతున్నారు. ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చక్కదిద్దుతూ అవసరానికి అప్పులు తెస్తూ సమర్థవంతంగానే సేవలు అందిస్తున్నా విజయసాయిరెడ్డికి ఉన్న ఉత్సాహంతోనే ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో విజయసాయిరెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలోనే కొనసాగిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నారు.

మంత్రివర్గంలో ఇదివరకే ఉన్న సమీకరణలను దృష్టిలో ఉంచుకుని సామాజిక వర్గాల పరంగా అంతే స్థాయిలో ఉండేలా చూసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరణించిన మేకపాటి గౌతం రెడ్డి స్థానంలో విజయసాయిరెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. కేబినెట్ కూర్పుపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ తదితర వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ కాపులను కూడా మంత్రివర్గంలో చేర్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: జనసేన ఆవిర్భావ సభ మార్గదర్శకాలు

Tags