Bigg Boss Telugu Non- Stop: తెలుగునాట బిగ్ బాస్ ఓటీటీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతోంది. 24 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉంది. అయితే గతం కంటే ఈ సీజన్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులు, బోల్డ్ కంటెంట్ మాటలు, గొడవలతో రచ్చరచ్చగా సాగుతోంది. 17 మంది కంటెస్టెంట్ లు హౌస్ లోకి వెళ్లగా.. గడిచిన రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు.
మొదటివారం ముమైత్ ఖాన్ వెళ్ళిపోగా.. రెండో వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయింది. అయితే ప్రతి ఆదివారం ఎలిమినేట్ ఎపిసోడ్ ఉంటుందని మనందరికీ తెలిసిందే. నాగార్జున వచ్చి కంటెస్టెంట్ ల తో సరదాగా కొన్ని ఆటలు ఆడిస్తుంటాడు. చివరగా ఎలిమినేట్ అయిన వారిని సాగనంపుతారు. ఈ ఆటలతో సండే ఫుల్ ఫన్ డే గా సాగిపోతుంది. కాగా నిన్న ఆదివారం నాగార్జున సరికొత్తగా హోస్టింగ్ చేశాడు.

నాగార్జున వచ్చినప్పుడల్లా.. తప్పులు చేస్తున్న వారిని మందలిస్తూ.. బాగా ఆడుతున్న వారిని అభినందిస్తూ మెచ్చుకుంటాడు. నిన్న ఆదివారం కూడా ఇలాగే చేయడంతో చాలా మంది కంటెస్టెంట్ ల మధ్య ఉన్న గొడవలు సద్దుమణిగి పోయినట్టు అనిపిస్తుంది.
Also Raad: SS Rajamouli: రాజమౌళి అంటే ఇప్పుడొక చరిత్ర
రెండో వారం 11 మంది నామినేట్ అవ్వగా.. వారిని సేఫ్ చేసేందుకు ఇద్దరు చొప్పున ఆటలు ఆడించాడు. ఇందులో భాగంగా డబుల్ మీనింగ్ డైలాగులతో హోస్టింగ్ చేశాడు. అషు రెడ్డి, అఖిల్ సార్థక్ లను స్టోర్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న సామానులు తేవాలంటూ చెప్పాడు.

సామాన్లు మాత్రమే తేవాలని అక్కడ ఇంకేం చేయొద్దంటూ డబుల్ మీనింగ్ మాటలు వదిలాడు. నాగార్జున మాటలకు అఖిల్ తల పట్టుకున్నాడు. అషు రెడ్డి అయితే ఇంకేం చేస్తాం సార్ అంటూ సిగ్గు పడింది. ఇలా కంటెస్టెంట్ ల మధ్యలో ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నాడు మన్మధుడు.
Also Read: Prabhas Salaar Movie: అటు తండ్రి, ఇటు కూతురు.. మధ్యలో ప్రభాస్
[…] […]