CM Vijay: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు అనేక రకాలుగా ఇబ్బందులు పడిన టీవీకే అధినేత విజయ్.. ఆ తర్వాత వరుసగా ఎదురవుతున్న పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొంటున్నారు. అందులో అంచనాలకు అందని విధంగా విజయాలు సాధిస్తూ అదరగొడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఇటీవల తన తొలి స్పీచ్ లో దంచిగొట్టిన విజయ్.. స్పీకర్ విషయంలో, డిప్యూటీ స్పీకర్ విషయంలో తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తన పార్టీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులకు ఆ పదవులు లభించే విధంగా చూసుకున్నారు. ఇప్పుడు విశ్వాస పరీక్షలోనూ అదరగొట్టారు విజయ్.
తమిళనాడులో బుధవారం టి వి కే విజయ్ ప్రభుత్వానికి బల పరీక్ష ఎదురైంది. ఆ పరీక్షలో విజయ్ విజయం సాధించారు. అసెంబ్లీలో బుధవారం విశ్వాస పరీక్ష నిర్వహిస్తే.. టీవీ కేకు ఏకంగా 144 ఓట్లు వచ్చాయి. విజయ్ పార్టీకి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే, అన్న డీఎంకేకు సంబంధించిన కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. అన్న డీఎంకేకు సంబంధించిన 22 మంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. డీఎంకే ఈ ఓటింగ్ లో పాల్గొనలేదు. పైగా వాక్ అవుట్ కూడా చేసింది.
విశ్వాస పరీక్షలో ఏకంగా 144 ఓట్లు సాధించి విజయ్ తన ప్రభుత్వానికి ఇబ్బందులులేకుండా చూసుకున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందుగానే విజయ్ అన్న డీఎంకే నేతలతో విజయ్ టచ్లోకి వెళ్లారు వారితో పొత్తు ప్రతిపాదన తెచ్చారు. దానికి అన్న డీఎంకే పార్టీలోని కొంతమంది వ్యక్తులు సమ్మతం తెలిపారు. అయితే పలని స్వామి మాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఆ నేతలు అ ఇష్టంగానే బిజెపితో కలిసి సాగారు.
చివరికి ఎన్నికలు టీవీకే పార్టీకి అధికంగా సీట్లు రావడంతో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు తమ తిరుగుబాటును ప్రదర్శించారు. అంతేకాదు సొంత కార్యవర్గాన్ని నియమించుకుంటున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా విజయ్ పార్టీకి సపోర్ట్ ఇచ్చి.. ప్రభుత్వాన్ని నిలబెట్టారు. తద్వారా బీజేపీ పెత్తనం తమ మీద వద్దని సంకేతాలు ఇచ్చారు. ఈ విజయంతో విజయ్ తన ప్రభుత్వానికి డోకా లేకుండా చూసుకున్నారు. అంతేకాదు ఐదేళ్లపాటు అద్భుతంగా పరిపాలిస్తామని సంకేతాలు కూడా ఇచ్చారు.