Telangana Congress: ఫస్ట్ లిస్ట్ ప్రకటనలో కాంగ్రెస్ రచ్చ మొదలైంది. టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్యమయ్య పార్టీకి గుడ్‌బై చెప్పారు. నాగం జనార్దన్‌రెడ్డి అనుచరులతో సమావేశమయ్యారు. టికెట్ దక్కని నేతలు గాంధీభవన్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. రేవంత్ టార్గెట్‌గా ఆరోపణలు చేస్తున్నారు.
అమర వీరుల స్తూపం వద్ద ఆందోళన..
తాజాగా గద్వాల నేతలు ఆందోళనకు దిగారు. టీపీసీసీ సెక్రెటరీ డాక్టర్ కురువ విజయ్‌కుమార్ తన అనుచరులతో కలిసి హైదరాబాద్ అమరవీరు స్తూపం వద్ద ఆందోళన చేశారు. రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రూ.10 కోట్లు, 5 ఎకరాలకు భూములు అమ్ముకున్నారని ఆరోపించారు. ‘నాడు ఓటుకు నోటు, నేడు సీటుకు నోటు’ అంటూ నినాదాలు 65 సీట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపణ తెలంగాణ ఉద్యకారులకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారు. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి కాకుండా… పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే టికెట్లు కేటాయించారు. రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతోందని ఆరోపించారు. టీపీసీసీ పదవి నుంచి రేవంత్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు.
ఈసీ దృష్టికి టిక్కెట్ల వ్యవహారం..
రేవంత్‌రెడ్డి అక్రమాలపై ఈడీ, ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి లిస్టును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.. పోలీసులు నాకు రక్షణ కల్పించాలి.
తనకు ఏం జరిగినా రేవంతే బాధ్యుడు..
ఆందోళన అనంతరం విజయ్‌కుమార్ మాట్లాడుతూ తనకు రేవంత్‌రెడ్డితో ప్రాణభయం ఉందన్నారు. తనకు ఏం జరిగినా టీపీసీసీ చీఫ్ బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఇప్పటికే తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు..
మరోవైపు ఫస్ట్ లిస్ట్‌లో టికెట్లు ఆశించి భంగపడిన నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు బీఆర్‌ఎస్‌తో టచ్‌లోకి వెళ్లారు. మరికొందరు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. కొందరిని బీజేపీలోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు ప్యాకేజీల కోసం ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ ప్యాకేజీ ఇస్తే ఆ పార్టీలోకి వెళ్లాలని చూస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడిన నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తాజాగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిశారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డితోపాటు మరికొందరు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.