Viral Video: పెంపుడు కుక్కలు తప్పిపోయిన ప్పుడు పోస్టర్లు, ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటాం. కొంతమంది పెట్స్ జ్ఞాపకార్థం విగ్రహాలు, సమాధులు నిర్వహిస్తారు. మరికొందరు పెట్స్‌కు బారసాల, బర్త్‌డే, శ్రీమంతాలు చూయడం కూడా చూస్తుంటాం. పెట్స్ అంటే అంత ప్రేమ చూపుతారు. అయితే ఆస్ట్రేలియాలో ఓ పెట్‌ను కాంగారూ ఎత్తుకెళ్లింది. దీనికోసం యజమాని ప్రణాలకు తెగించి తన పెట్‌ను కాపాడుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏం జరిగిందంటే..
ఆస్ట్రేలియాకు వెళ్లే చాలా మంది వ్యక్తులు సాలెపురుగులు, పాములతో సహా అనేక ప్రమాదకరమైన జీవులకు భయపడతారు. ఎందుకంటే అక్కడి నివాస ప్రాంతాలలో ఇలాంటి జీవులు విచ్చలవిడిగా సంచరిస్తూ విరివిగా కనిపిస్తాయి. ఇవి కాకుండా, ఇక్కడి ప్రజలను భయపెట్టేందుకు అనేక ఇతర జంతువులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా నుంచి మరోసారి ఆశ్చర్యకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో కంగారు తన గోళ్లతో కుక్కను పట్టుకుని ఈడ్చుకెళ్లటం కనిపిస్తుంది. కంగారు పంజా నుంచి తప్పించుకోలేక ఆ కుక్క నిస్సహాయంగా ఉండిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రెండు మీటర్ల పొడవున్న కంగారూ..ఒక కుక్కను చెరువులోకి ఈడ్చుకెళ్లింది..కుక్క ఏరకంగానూ తప్పించుకునే అవకాశం లేకుండా.. గట్టిగా పట్టుకుంది.. ఈ కుక్క మిక్ మోలోనీ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క అని తెలిసింది.
వాకింగ్‌కు వెళితే..
మిక్‌మాలోనీ తన కుక్కను ముర్రే నది ఒడ్డున వాకింగ్ కోసం తీసుకువచ్చాడు. అయితే, తన కుక్క అకస్మాత్తుగా అదృశ్యమైంది. మోలోనీ తన కుక్క కోసం చాలా సేపు వెతికినా ఎక్కడా కనిపించలేదు. అయితే, చాలా సమయం తర్వాత అతను కంగారు బారిలో చిక్కుకున్న తన కుక్కను చూశాడు. దాంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
పెట్‌ను కాపాడుకున్నాడు..
యజమాని మోలోని కంగారూ బారి నుంచి∙తన కుక్కను ఎలాగైనా విడిపించాలనుకున్నాడు. అతడు తన కుక్క కోసం చూస్తుండగా.. అది అతన్నే చూస్తూ ఉండటం గమనించాడు. అప్పటికే ఆ కంగారూ కుక్కను నీటిలో సగానికి ముంచేసింది. తన కుక్కను రక్షించడానికి, మోలోనీ ఏ మాత్రం ఆలోచించకుండా నీటిలోకి వెళ్లిపోయాడు.. తన చేతిలో కెమెరాతో ఇదంతా షూట్ చేస్తూనే.. అతను కంగారు దగ్గరికి వెళ్లి కుక్కను కంగారు బారి నుండి విడిపించాడు. దాంతో కంగారు కోపం తెచ్చుకుని మోలోనీపై దాడికి దిగింది. ఇరువురి దాడి క్రమంలో అతని కెమెరా నీటిలో పడిపోతుంది. కానీ, ఎలాగోలా మోలోనీ నీటి నుంచి కెమెరాను బయటకు తీసుకున్నాడు. మరోవైపు తన ప్రాణాలను కాపాడుకున్న కుక్క బతుకు జీవుడా అనుకుంటూ.. అక్కడి నుంచి పారిపోయింది. అప్పుడు కూడా కంగారు ఛాతీని పైకి లేపి నిలబడి మోలోనిని చూస్తూనే ఉంది. కంగారూ మోలోనీని పట్టుకోవాలని పదేపదే ప్రయత్నించినా కుదరలేదు. చేసేది లేక కంగారు మోలోనీ ముఖం వైపు చూస్తూ ఉండిపోతుంది.
Dude fights Kangaroo to help free his dog pic.twitter.com/Kdag80rsIY
— Crazy Clips (@crazyclipsonly) October 16, 2023
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Man fights jacked kangaroo to save his dog from drowning
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com