Venkatakrishna
Venkatakrishna : ఆ మధ్య తెలంగాణ ప్రాంతాన్ని చెందిన బయ్య సన్నీ యాదవ్ పై నా అన్వేషణ అన్వేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఇంకా కొంతమంది యూట్యూబర్లపై కూడా నా అన్వేషణ అన్వేష్ ఆరోపణలు చేశాడు..” బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్లు చేస్తే లక్షల్లో డబ్బులు ఇస్తారు. కొంత పేరు రాగానే చాలామంది యూట్యూబర్లు ఇలా బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేస్తున్నారు. దీనివల్ల చాలామంది మోసపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం లక్షల్లో ఖర్చుపెడతాయి. అమాయకులైన ప్రజల నుంచి కోట్లల్లో వసూలు చేస్తుంటాయి. అందువల్ల బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలి. వాటిని ప్రమోషన్ చేసే వారి మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని” నా అన్వేషణ అన్వేష్ అనేక సందర్భాల్లో చెప్పాడు. అయితే ఇటీవల ఓ యూట్యూబర్ అయిన ఇమ్రాన్ పై నా అన్వేషణ అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఇమ్రాన్ అమ్మగారిని ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.
Also Read : ఏబీఎన్ వెంకటకృష్ణ సొంత డిజిటల్ మీడియా… కొందరు టీడీపీ పెద్దల అండదండలు
కేసు పడుతుందట..
యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పు పట్టింది. ఇటీవల కాలంలో యూట్యూబర్లపై కేసులు కూడా నమోదు చేసింది. ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో అనేక న్యూస్ చానల్స్ వీటిపై డిబేట్ నిర్వహించాయి. ఇక అందులో ఓ న్యూస్ ఛానల్ కూడా ప్రైమ్ టైం డిబేట్ నిర్వహించింది. ఇదే క్రమంలో యూట్యూబర్లపై విస్తృతంగా చర్చ జరిగింది. ఆ చర్చలో చాలామంది తమ తమ అనుభవాలను పంచుకున్నారు. అందులో ఒక మహిళ ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ పై కేసు పెడతానంటూ మండిపడింది. ” నా అన్వేషణ అన్వేష్ తనొక సెలబ్రిటీ అనుకుని భావిస్తున్నాడు. ప్రపంచయాత్రికుడిగా డబ్బాలు కొడుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఇమ్రాన్ అనే ఓ వ్యక్తి తల్లిగారిని దూషించాడు. అనకూడని మాటలు అన్నాడు. అటువంటి వ్యక్తి పై కచ్చితంగా నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. వాడిపై కేసు పెడతాను. ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.. కచ్చితంగా ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తానని” ఆ మహిళ అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు మిగతావారు కూడా సంఘీభావం తెలిపారు. అటువంటి వ్యక్తులపై కేసులు పెట్టాలని.. న్యాయ పరంగా శిక్ష పడేలా చేయాలని ఏబీఎన్ వెంకటకృష్ణ కూడా కోరాడు. ఇక ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్, వాటికి ప్రమోషన్ చేస్తున్న వారికి వ్యతిరేకంగా నా అన్వేషణ అన్వేష్ యుద్ధం చేస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు అతడే పోలీస్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అతడు చేసిన “ఆటగాడు” .. “ఆటల పోటీలు” అనే వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీసాయి. ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్లో కొంతమంది వక్తలు ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం విశేషం. మొత్తంగా చూస్తే నా అన్వేషణ అన్వేష్ పోలీస్ కేసులను ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది.
Also Read : పథకాలు చిల్లర డబ్బులా.. ప్రజలకు అవసరం లేదా సాంబశివ?
నా అన్వేష్ పై కేసు పెడతా వాడిని వదిలిపెట్టే సమస్యే లేదు | ABN Telugu#NaaAnveshana #BettingApps #ABNTelugu pic.twitter.com/SJUsAomcOM
— ABN Telugu (@abntelugutv) March 21, 2025