Homeఆంధ్రప్రదేశ్‌TV 5 Sambasiva Rao  : పథకాలు చిల్లర డబ్బులా.. ప్రజలకు అవసరం లేదా సాంబశివ?

TV 5 Sambasiva Rao  : పథకాలు చిల్లర డబ్బులా.. ప్రజలకు అవసరం లేదా సాంబశివ?

TV 5 Sambasiva Rao : టీవీ 5 లో సాంబశివరావు వచ్చేసాడు. ప్రైమ్ టైం డిబేట్ మొదలుపెట్టాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాంబశివరావు టీవీ5 నుంచి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయినప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏదో ఒక పదవి ఇస్తారు కావచ్చని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. పైగా సాంబశివరావు కూడా మీడియాలో కనిపించలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆయన మరో ఛానల్ లో చేరిపోయాడని.. టీవీ5 యాజమాన్యంతో విభేదాలు వచ్చాయని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. చివరికి సాంబశివరావు మళ్లీ జాయిన్ అవుతున్నాడని టీవీ 5 యాజమాన్యం చెప్పడంతో.. ఆ ఊహగానాలకు చెక్ పడింది.

Also Read : రఘురామ, ఏబీఎన్ వెంకటకృష్ణ మీరు మారరయ్యా

టీవీ 5 లో ప్రైమ్ టైం డిబేటర్ గా సాంబశివరావు మళ్ళీ వచ్చాడు. ఇటీవల ఇదే విషయాన్ని టీవీ5 యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా చెప్పింది. ఇక వచ్చి రాగానే తన మార్క్ భాష్యాలను సాంబశివరావు చెప్పడం మొదలుపెట్టాడు. గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు కాని పక్షంలో.. తనదైన విమర్శలు చేశాడు సాంబశివరావు. “హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు వాటిని అమలు చేయలేకపోతున్నారు. ప్రజలు నమ్మి ఓటు వేసినందుకు ఇలా చేస్తారా? ప్రజలను మోసం చేస్తారా? ఇందుకోసమేనా అధికారంలోకి వచ్చింది?” అని తనదైన శైలిలో విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో సాంబశివరావు తన స్వరాన్ని మార్చారు.

ప్రజలు చిల్లర కోసం ఆశపడటం లేదట

కూటమి ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా సాంబశివరావు షుగర్ కోటెడ్ జర్నలిజం చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలు అంటూ ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన కూటమి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో ఆపసోపాలు పడుతున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల పథకాలు అమలు చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని నేరుగా చంద్రబాబు నాయుడే చెప్పేశారు. దీంతో పథకాల అమలు ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోయింది. కొన్ని పథకాలకు అంతంతగా కేటాయింపులు జరపడం కూడా కూటమి ప్రభుత్వం అసలు ఉద్దేశాన్ని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడానికి సాంబశివరావు తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రజలు బిచ్చగాళ్లు కాదని.. ప్రభుత్వాలు వేసే చిల్లర కోసం ఆశపడటం లేదని.. వారు కష్టపడాలనుకుంటున్నారని.. కష్టపడి తన పిల్లల్ని చదివించుకోవాలనుకుంటున్నారని..ఇలా సొంత భాష్యాలు చెప్పడం ప్రారంభించారు. సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. నాడు సుద్దులు చెప్పారు.. నేడు షుగర్ కోటెడ్ నీతులు చెబుతున్నారు అంటూ మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పథకాలను తెగ ప్రచారం చేసుకున్నారని.. ఇప్పుడేమో వాటిని అమలు చేయడం సాధ్యం కాక ఇలా డైవర్ట్ జర్నలిజంతో ప్రజల ఆలోచనలను మార్చి వేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇలానే చేస్తే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరిస్తున్నారు.

Also Read : జగన్ కు చెక్ చెప్పడం ఎలా?.. అలా నరుక్కొని వస్తున్న బిజెపి!

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version