Delhi Pollution
Vehicles Ban : ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ వాహనాలను పూర్తిగా నిలిపి వేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, కేంద్ర ప్రభుత్వం జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో డీజిల్, పెట్రోల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి.. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), హైబ్రిడ్ లేదా CNG వేరియంట్‌లను ప్రోత్సహించే ఆలోచనలో ఉంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆటోమొబైల్ కంపెనీలతో పాటు అనేక ఇతర వాటాదారులతో మంత్రిత్వ శాఖలు సంప్రదింపులు జరిపాయి.
Also Read : గుడ్‌బై నిస్సాన్.. హలో రెనాల్ట్? భారత్‌లో ఆటోమొబైల్ రంగంలో బిగ్ ట్విస్ట్!
నివేదిక ప్రకారం, కొత్త ప్రణాళిక ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న దాని మీద క్లారిటీ లేదు. అయితే, మొదట ఢిల్లీకి సంబంధించిన నిషేధాజ్ఞలు రావచ్చునని తెలుస్తోంది. ఆ తర్వాత గురుగ్రామ్, గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్ వంటి పరిసర జిల్లాల్లో అమలు చేయవచ్చు. 2025 నాటికి కొత్త కార్లు, ద్విచక్ర వాహనాలను కేవలం గ్రీన్ ఫ్యూయల్‌కు మాత్రమే పరిమితం చేయవచ్చని నివేదిక పేర్కొంది. అయితే కొన్ని ఆంక్షలు ఈ ఆర్థిక సంవత్సరం నుండే క్రమంగా ప్రారంభం కావచ్చు.
శుభవార్త ఏమిటంటే, ఈ ఆదేశాలు వ్యక్తిగత వాహనదారులకు చివరి వరకు రావచ్చు. మొదటగా ఈ ఆదేశాలు వాణిజ్య వాహనాలకు వర్తించే అవకాశం ఉంది. 2025 చివరి నాటికి ఢిల్లీలో కేవలం ఎలక్ట్రిక్ లేదా CNGతో నడిచే కొత్త బస్సుల రిజిస్ట్రేషన్‌ను మాత్రమే పరిమితం చేయవచ్చని అంచనా వేస్తున్నారు. త్రీ టైర్ లోడింగ్ వాహనాలు, తేలికపాటి సరుకు రవాణా వాహనాల కోసం గడువు 2027 వరకు ఉండవచ్చు. కమర్షియల్ టాక్సీల కోసం మరింత ఎక్కువ సమయం పట్టవచ్చు. అంతేకాకుండా, BS 6 కంటే తక్కువ ఉద్గార ప్రమాణాలతో నడిచే అన్ని సరుకు రవాణా వాహనాల ప్రవేశాన్ని ఢిల్లీలో నిషేధించవచ్చని నివేదిక పేర్కొంది.
మరోవైపు, ఢిల్లీ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. కొత్త ప్రణాళిక ప్రకారం, ప్రభుత్వం డ్రోన్ మిస్ట్ స్ప్రింక్లర్లను ఉపయోగించనుంది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో అవుట్‌డోర్ ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, కొత్త ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఎక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ మిస్ట్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేస్తారు. స్ప్రింక్లర్ల సహాయంతో కాలుష్యాన్ని తగ్గిస్తారు.
Also Read : తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఏ కారులో ఉన్నాయి? టియాగో లేదా స్విఫ్ట్?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Vehicles ban center plans to ban petrol and diesel cars to combat pollution
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com