Gyanvapi Masjid Case: కొద్ది నెలలుగా వారణాసి శృంగర్ గౌరీ జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ముస్లింలు, హిందువులు ఎవరి వాదనలు వాళ్ళు వినిపించారు. అయితే మసీద్ కాంప్లెక్స్ లో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై సోమవారం వారణాసి కోర్టు తీర్పు ఇవ్వనుంది. దీంతో ఉద్రిక్తతలు చెలరేగుతాయనే అనుమానంతో పోలీసులు ముందస్తుగా వారణాసిలో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సోమవారం కావడం.. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో వారణాసిలోని కాశి విశ్వనాధ్ ఆలయంలో పోలీసులు భద్రతను భారీగా పెంచారు. అయితే శృంగేరి గౌరి మసీదు లో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి ఇవ్వాలనే విషయంపై దాఖలైన పిటిషన్ కు సంబంధించి ఇప్పటికే జిల్లా న్యాయమూర్తి అజయ్ కృష్ణ పలు వాదనలు విన్నారు. ఇందులో భాగంగా కొన్ని హిందూ సంఘాలు పూర్తి ఆధారాలను న్యాయమూర్తి ముందు ఉంచాయి. అయితే ఆగస్టు 24వ తేదీనే న్యాయమూర్తి తీర్పును సిద్ధం చేశారు. అయితే ఉన్నత న్యాయమూర్తుల సూచన మేరకు వాయిదా వేశారు.

అసలు వివాదం ఏంటంటే
ప్రస్తుతం మసీద్ కాంప్లెక్స్ లో చెరువు ఉంది. అందులో శివలింగాకారంలో ఉన్న ఒక ఆకృతి బయటపడిందని, శివుడు మాకు ఆరాధ్యమైన దేవుడు అని పేర్కొంటూ ఐదుగురు హిందూ మహిళలు జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో హిందూ, ముస్లింల మధ్య వాదనలు చెలరేగాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఒకానొక దశలో దేశవ్యాప్తంగా ఉన్న మసీదులన్నింటిలో తవ్వకాలు జరపాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఇందుకు ఘాటుగానే ముస్లిం సంఘాలు స్పందించాయి. పరిస్థితి నానాటికి చేయి దాటే అవకాశం ఉండటంతో రంగంలోకి దిగిన కోర్టు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
Also Read: Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. భారీ స్కెచ్.. ఇలా లీక్

అక్కడ వీడియో సర్వే కూడా నిర్వహించింది. చెరువులో ఉంది శివలింగాకారంలో ఉన్న ఆకృతి కాదని మసీద్ కమిటీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అనేక వాదనల తర్వాత సుప్రీంకోర్టు కేసును వారణాసి కోర్టుకే బదిలీ చేసింది. కమిటీ రిపోర్ట్ కూడా సీల్డ్ కవర్లో వారణాసి కోర్టుకు చేరింది. అయితే వీడియో రికార్డింగ్ కు సంబంధించిన పుటేజీలు బయటికి రావడంతో కలకలం చెలరేగింది. దీంతో అప్పటినుంచి మసీదు పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆ ప్రాంతంలో రాకపోకలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి అజయ్ కృష్ణ ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వారణాసి కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే అలహాబాద్ కోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తామని పిటీషనర్లైన ఆ ఐదుగురు మహిళలు చెబుతున్నారు.