Vangaveeti Radhakrishna- JanaSena: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకోనుందా..? విజయవాడ నడిబొడ్డులో పొలిటికల్ గేమ్ కొత్త టర్న్ తీసుకోబోతోందా..? ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు ట్రై చేస్తున్న జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం పూర్తిస్థాయిలో అడగా నిలవనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది పొలిటికల్ సర్కిల్స్ నుంచి. కాపునేత వంగవీటి రంగా సోదరుడు టీడీపీ నాయకుడు వంగవీటి రాధా త్వరలో జనసేనలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారం ఇందుకు కారణం. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఈ భేటీతో వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

ఏపీలో పాపులారిటీ..
వంగవీటి కుటుంబానికి ఒక్క విజయవాడలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. ఇప్పుడు వంగవీటి రాధా జనసేనలో చేరితే ఆ పార్టీకి మరింత బలం చేకూరుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. 2019 ఎన్నికల్లో కాపులు గంంప గుత్తగా వైసీపీకి అండగా నిలిచారు. ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన హామీలను, నిజర్వేషన్ హామీని నెరవేర్చడంలో జగన్ విపలమయ్యారు. ఈ నేపథ్యంలలో కాపులు వైసీపీకి దూరమవుతున్నారు. ఈ అవకాశాన్ని అందుపుచ్చుకోవాలని చూస్తోంది జనసే. ఈ నేపథ్యంలో బలమైన కాపు నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తు మొదలు పెట్టింటి.
తగ్గిన ముద్రగడ ప్రభావం..
ఏపీలో 2019కి ముందు కాపు నేత ముద్రగడకు మంచి క్రేజీ ఉండేంద. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆయన సారథ్యంలో కాపులు పెద్ద ఉద్యమమే నడిపారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీని వీడి వైసీపీ పక్షాన నిలిచారు. ఇది జగన్ పార్టీ గెలుపునకు కారణమైంది. అయితే జగన్ కూడా హామీలు పెద్దగా నెరవేరచలేదు. కానీ ముద్రగడ సైలెంట్ అయ్యారు. దీంతో ఆసామాజిక వర్గాల్లో ఆయనపై విశ్వాసం తగ్గింది. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న రాధాను జనసేనలోకి తీసుకురావడానికి కసరత్తు జరుగుతోంది.

చంద్రబాబు పక్కన పెట్టేశారా?
2019 ఎన్నికల సమయంలో వంగవీరి రాధా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ కూడా చేశారు. కానీ వైసీపీ గాలిలో ఓడిపోయారు. దీంతో రాధాకు కూడా కాపుల్లో పెద్దగా గుర్తింపు లేదని చంద్రబాబు ఎన్నికల తర్వాత ఆయనను పక్కన పెట్టారు. దీంతో రాధా కూడా ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు. ఆయన సేవలను వినియోగించుకోవాలని జన సేనాని భావిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే రాధా జన సైనికుడు కావడం ఖాయం.