Vangaveeti and Devineni: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణా జిల్లాకు ప్రత్యేక స్థానముందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయంగా చైతన్యం కలిగిన జిల్లాగా కృష్ణా జిల్లాకు పేరే గుర్తుకు వస్తుంది. ఇక్కడి ఓటర్లు ప్రతీ సారీ ఒకే పార్టీకి పట్టం కట్టే పరిస్థితి లేదు. అప్పటి రాజకీయ పరిస్థితులు, స్థానికంగా ఉండే పలుకుబడితో పాటు పలు విషయాలకు అనుగుణంగా ఓటర్లు ఓట్లు వేస్తుంటారు. అలా తమకు నచ్చిన పార్టీకే పట్టం కడుతారు ఇక్కడి ప్రజలు. 2014లో టీడీపీ వైపు నిలబడ్డ జిల్లా ఓటర్లు, 2019లో మాత్రం వైసీపికి మొగ్గు చూపారు.

ఈ జిల్లాలో మొదటి నుంచి టీడీపీకి కాస్త పట్టుంది. కానీ, ఆ పట్టును పార్టీ నిలుపుకోలేకపోయింది. ఇకపోతే ఈ జిల్లా రాజకీయంలో బెజవాడ పాలిటిక్స్ మరో సెపరేట్ చాప్టర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఒకప్పుడు వంగవీటి వర్సెస్ దేవినేని అనేలా రాజకీయాలు జరిగాయి. కాగా, గత రెండున్నర దశాబ్దాలుగా ఆ వేడి కాస్త చల్లారింది. కాగా, మరోసారి పోరు ఈ రెండు వర్గాల మధ్య రాజకీయ రణరంగం మొదలుకాబోతున్నట్లు తెలుస్తోంది. అందుకుగాను టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేస్తున్నట్లు వినికిడి.
2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో టీడీపీ పట్టు తప్పింది. గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకి కేవలం రెండే సీట్లు వచ్చాయి. విజయవాడ ఈస్ట్, గన్నవరం కాగా, ఇందులో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి జై కొడుతున్నాడు. ఇక విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ మాత్రం పార్టీలోనే కొనసాగుతున్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను వంశీకి పోటీగా గన్నవరం పంపాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే వంగవీటి రాధాను విజయవాడ ఈస్ట్ నుంచి బరిలో దించాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు టాక్. ప్రజెంట్ విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్‌చార్జిగా దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ ఉన్నారు.
Also Read: Nara Lokesh: నారా లోకేష్ కు దారేది..?
ఈ క్రమంలోనే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వంగవీటి రాధా టీడీపీ తరఫున బరిలో దిగితే బెజవాడ రాజకీయాలు మళ్లీ హీటెక్కడం ఖాయమని చెప్పొచ్చు. గతంలో 2004 నుంచి 2009 వరకు వంగవీటి రాధా విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మళ్లీ ఈస్ట్ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సెంట్రల్ వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్నా టికెట్ పై హామీ లేకపోవడంతో టీడీపీలో చేరారు. అయితే, 2019 ఎన్నికల్లో పోటీ వంగవీటి రాధా పోటీ చేయలేదు. ప్రస్తుతం మళ్లీ పాలిటిక్స్‌లో యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో 2024లో ఈస్ట్ నుంచి రాధాను బరిలోకి దించాలని టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ రాధా బరిలో దిగితే ఈ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు రాజకీయం రణరంగంలా మారిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Ashok Gajapati Raju: అశోక్ గజపతి రాజుపై మరో అస్త్రాన్ని గురిపెట్టిన జగన్ ప్రభుత్వం..