https://oktelugu.com/

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ చుట్టు ఉచ్చు.. తెరపైకి ఆ కేసు

వైసీపీ ఫైర్ బ్రాండ్లలో చాలామంది ఉన్నారు. అందులో కొడాలి నాని ఒకరు. ఆయన స్నేహితుడు వంశీ మరొకరు. ఇప్పుడు ఆ ఇద్దరిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. లోకేష్ రెడ్ బుక్ మూడో పేజీ వారి కోసమేనని టాక్ నడుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 9, 2024 / 11:11 AM IST

    Vallabhaneni Vamsi

    Follow us on

    Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. టిడిపిలో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు వల్లభనేని వంశీ. 2014లో అనూహ్యంగా గన్నవరం తెరపైకి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. ఆ సమయంలోనే ఆయనపై నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన నమోదయింది. నియోజకవర్గ పరిధిలోని బాపులపాడు లో నకిలీ ఇళ్ల పట్టాలను తయారు చేయించి పంచారు. అప్పట్లో అధికారంలో ఉండడంతో సేవ్ అయ్యారు వంశీ. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అదే నకిలీ ఇళ్లపట్టాల కేసులు సాకుగా చూపి.. వంశీని తెగ భయపెట్టింది. ఆ పార్టీలో చేర్చుకుంది. కానీ గత ఐదేళ్లలో ఆ కేసు విషయంలో ఎటువంటి క్లీన్ చీట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఓ వ్యక్తి దీనిపై కోర్టులో పిటిషన్ వేశారు. అన్ని ఆధారాలు ఉండడంతో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీ చుట్టు ఉచ్చు బిగించే అవకాశం ఉంది.

    * చంద్రబాబు కుటుంబం టార్గెట్
    వల్లభనేని వంశీ గత ఐదేళ్లలో ఓ రేంజ్ లో ఇబ్బంది పెట్టారు టిడిపిని, చంద్రబాబు కుటుంబాన్ని. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. అయితే ప్రధానంగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుతోనే వైసీపీ ప్రలోభ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ కేసు మూలంగానే వల్లభనేని వంశీ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. చివరకు చంద్రబాబు సతీమణి పై సైతం నిందలు వేయగలిగారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో వల్లభనేని వంశీ ఆచూకీ లేకుండా పోయింది. అమెరికా వెళ్లిపోయారని ఒకసారి, హైదరాబాదులోనే ఉంటున్నారని మరోసారి ఇలా చాలా రకాలుగా ప్రచారం సాగింది. తాజాగా అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే నకిలీ ఇళ్ల పట్టాల కేసు తెరపైకి వచ్చింది.కోర్టు ఆదేశాలతో పోలీసు కేసు నమోదయింది.

    * కోర్టు ఆదేశాలతో కేసు
    మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్కు థర్డ్ పేజీ తెరిచినట్లు ప్రచారం సాగుతోంది. అందులో కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో వల్లభనేని వంశీ చుట్టు ఉచ్చు బిగిసుకునే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో సైతం వల్లభనేని వంశీ గత ఐదేళ్లుగా టిడిపి శ్రేణులకు నరకం చూపించారు. ఏకంగా టిడిపి కార్యాలయం పైనే దాడి చేయించారు. ఆ కేసు ఒకవైపు కొనసాగుతుండగా ముందస్తు బెయిల్ తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం వెలుగులోకి రావడంతో వంశీ ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయం.