https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : నలుగురికి సమానమైన ఓట్లు.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో గేమ్ చేంజర్ గా నిల్చిన టేస్టీ తేజ!

ఒకవేళ నిఖిల్ గుడ్డు బయటే ఉండి, ఆయనకీ ఎవిక్షన్ పాస్ దొరికి ఉండుంటే పృథ్వీ, యష్మీ లలో కచ్చితంగా ఎవరినో ఒకరిని సేవ్ చేసేవాడు. అలా చివరి నిమిషం లో గేమ్ మొత్తాన్ని మార్చేసి, గేమ్ చేంజర్ గా నిలిచాడు టేస్టీ తేజా.

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2024 / 11:06 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ వారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియ లో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి యష్మీ, ప్రేరణ, హరితేజ, నిఖిల్, పృథ్వీ, విష్ణు ప్రియ మరియు గౌతమ్ నామినేట్ అయ్యారు. వీరిలో గౌతమ్, నిఖిల్ కి మధ్య ఓటింగ్ లో నువ్వా నేనా అనే రేంజ్ పోటీ జరుగుతుంది. ప్రస్తుతానికి గౌతమ్ నిఖిల్ మీద 7 శాతం మార్జిన్ ఓట్ల ఆధిక్యంతో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. అధికారిక పోలింగ్స్ లో కూడా ఇదే తరహా ట్రెండ్ ఉన్నట్టు సమాచారం. వీళ్లిద్దరి తర్వాత ఈ వారం మెగా చీఫ్ గా ఎంపికైన ప్రేరణ అత్యధిక ఓటింగ్ తో మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత చివరి నాలుగు స్థానాల్లో విష్ణు ప్రియ, యష్మీ, హరితేజ , పృథ్వీ కొనసాగుతున్నారు. ఈ నలుగురిలో హరితేజ కి తప్ప మిగిలిన ముగ్గురికి సరిసమానమైన ఓట్లు వచ్చాయి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ పెడితే హరి తేజ తో పాటు ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చెప్పలేకపోతున్నారు విశ్లేషకులు. అంత కఠినమైన పరిస్థితులు ఈ వారం ఉన్నాయి.

    మరో విశేషం ఏమిటంటే హరితేజ కి కూడా వీళ్ళ ముగ్గురితో దాదాపుగా సమానమైన ఓటింగ్ వచ్చింది. కేవలం ఒక్క శాతం ఓటింగ్ మాత్రమే తేడా ఉంది. హరితేజ కి సినిమా ఆడియన్స్ కూడా ఫ్యాన్స్ గా ఉంటారు కాబట్టి, అధికారిక పోలింగ్ లో వాళ్ళ ఓట్లు కూడా పడుతూ ఉండొచ్చు. ఇదంతా పక్కన పెడితే నభీల్ చేతిలో ఇప్పుడు ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ అనే బ్రహ్మాస్త్రం ఉంది. దీనిని ఉపయోగించి ఆయన డబుల్ ఎలిమినేషన్ సందర్భం వచ్చినప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేసి, ఎవరిని కాపాడుతాడు అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. ఒకవేళ హరితేజ, యష్మీ డేంజర్ జోన్ లోకి వచ్చి, వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని సేవ్ చేయమని నభీల్ ని నాగార్జున ఆదేశిస్తే, నభీల్ ఎవరికీ ఆ పాస్ ని ఉపయోగించడని విశ్లేషకులు అంటున్నారు.

    ఒకవేళ హరితేజ,యష్మీ కాకుండా..పృథ్వీ, యష్మీ డేంజర్ జోన్ లోకి వచ్చినా నభీల్ ఎవిక్షన్ పాస్ ని ఎవరికీ ఉపయోగించడని అంచనా వేస్తున్నారు. అలా ఈ వీకెండ్ ఎపిసోడ్ మొత్తం చాలా ఉత్కంఠగా ఉండబోతుంది. పృథ్వీ నిన్న మొన్నటి వరకు నభీల్ కి మంచి స్నేహితుడు. కానీ నిన్న వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. కాబట్టి ఆ పాస్ ని పృథ్వీ కి ఉపయోగించే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ మొదటి నుండి హౌస్ లో తనతో కలిసి ఉన్నాడు, చాలా కష్టపడి గేమ్స్ ఆడాడు, పృథ్వీ ఉండాలి అని నభీల్ న్యాయమైన నిర్ణయం తీసుకుంటే మాత్రం మళ్ళీ వీళ్లిద్దరు మంచి స్నేహితులు అయ్యే అవకాశం ఉంది. అయితే నభీల్ చేతుల్లోకి ఈ ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ రావడానికి కారణం టేస్టీ తేజ అని చెప్పొచ్చు. తేజ, యష్మీ లను బిగ్ బాస్ పిలిచి ఏకాభిప్రాయంతో ఒక కంటెస్టెంట్ కి సంబంధించిన గుడ్డుని పాము నోట్లో వేయాలని ఆదేశించగా తేజ నిఖిల్ ని వేద్దాం అని అంటాడు, యష్మీ మాత్రం రోహిణి అంటుంది. వీళ్లిద్దరి మధ్య దీని గురించి చాలాసేపటి వరకు చర్చ జరుగుతుంది. తేజ ఏకాభిప్రాయానికి రాకముందే నిఖిల్ గుడ్డుని పాము నోట్లోకి వేసేస్తాడు, దీనికి యష్మీ కోపంతో రోహిణి గుడ్డుని పాము నోట్లోకి వేసేస్తుంది. ఒకవేళ నిఖిల్ గుడ్డు బయటే ఉండి, ఆయనకీ ఎవిక్షన్ పాస్ దొరికి ఉండుంటే పృథ్వీ, యష్మీ లలో కచ్చితంగా ఎవరినో ఒకరిని సేవ్ చేసేవాడు. అలా చివరి నిమిషం లో గేమ్ మొత్తాన్ని మార్చేసి, గేమ్ చేంజర్ గా నిలిచాడు టేస్టీ తేజా.