Vallabhaneni Vamsi: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వైసీపీ, టీడీపీ చుట్టు తిరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. రాజకీయ వేడి రగులుకుంది. రెండు పార్టీల్లో అలజడులకు కేంద్ర బిందువైంది. టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలతో మొదలైన కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. టీడీపీ అధినేత దీనిపై ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఈనేపథ్యంలో 36 గంటల దీక్ష కూడా కొనసాగించారు టీడీపీ నేతలు. వైసీపీ నేతలు కూడా జనాగ్రహం పేరుతో కౌంటర్ దీక్షలు చేయడం గమనార్హం.

వైసీపీ నేతల ఆగడాలపై టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సహనంతోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. దీనిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో నష్టం కలిగే సూచనలున్నాయని చెప్పారు. గొడవలను సర్దుమణిగేలా మాట్లాడాలే కానీ అగ్నికి ఆజ్యం పోయొద్దని సూచిస్తున్నారు.
దమ్ముంటే గన్నవరం నుంచి లోకేష్ ను పోటీ చేయించి గెలిపించాలని సవాల్ చేశారు. పరిటాల సునీతకు ప్రత్యక్షంగానే చురకలు అంటించారు. వారు చేసిన వ్యాఖ్యలను ప్రముఖ ఇంగ్లిష్ వెబ్ సైట్ ప్రచురించింది. రాష్ర్టంలో జరుగుతున్న గొడవలకు చంద్రబాబే కారణమని చెప్పుకొచ్చారు. మొత్తానికి రాష్ర్టంలో రెండు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం గమనార్హం.
పరిటాల రవి హత్యలో చంద్రబాబు హస్తం లేదని ఆయన మనవడి మీద ఒట్టు వేస్తారా అని వంశీ సవాలు చేశారు. కోడెల మరణంలోనూ బాబు ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన ఘనుడని పేర్కొన్నారు. చంద్రబాబును ఉద్దేశించి పలు ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో పలువురు నేతలు రియాక్ట్ అవుతున్నారు. వంశీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.