Sreeleela: టాలీవుడ్ లో ఎప్పటినుంచో ఒక ఆచారం ఉంది. మన దర్శక నిర్మాతలకు ఎప్పటికప్పుడు కొత్త సరుకు కావాలి. కథల్లో కొత్తదనం లేకపోయినా నటీమణుల విషయంలో మాత్రం వాళ్ళు కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు. అందుకే, ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలో కనీసం డజను మంది అయినా కొత్త భామలు తెలుగు గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తారు. అయితే, వాళ్ళల్లో ఎక్కువ మంది ఎక్కువ కాలం ఉండరు అనుకోండి.

కాకపోతే, ఓ కొత్త హీరోయిన్ వచ్చిందండి అంటూ ఇండస్ట్రీ మొత్తానికి ఆ హీరోయిన్ డేటా మొత్తం వెళ్లపోతుంది. ఇక ఆ హీరోయిన్ లో ఏ కోణంలోనైనా మ్యాటర్ ఉంది అని అనిపిస్తే చాలు.. అందరి చూపు ఆమె వైపుకి వెళ్లిపోతుంది. అదెంటిమిటో గానీ ? ఎంతమంది వచ్చినా మనకు ఎప్పుడు హీరోయిన్ల కొరత ఉంటూనే ఉంటుంది. అందుకే, ఆ వచ్చే కొత్త భామల్లో కాస్త ప్రతిభుంటే చాలు, ఇక ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి మనవాళ్ళు పోటీ పడతారు.
ఆ పోటీలో ఆమెకు ఎక్కడ స్టార్ డమ్ వచ్చేస్తోందో.. మళ్లీ ఎక్కడ రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేస్తోందో అని మన నిర్మాతల భయం. అందుకే, త్వరగా తమ తరువాతి సినిమాలో పెట్టేసుకుని ఆమెకు అడ్వాన్స్ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది అని మన నిర్మాతల ఆత్రం. ఇందుకు ఉదాహరణ.. ఉప్పెన హీరోయిన్. ఆ సినిమా తరవాత కృతి శెట్టి జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమెకు వరుసగా అడ్వాన్స్ లు వచ్చి పడ్డాయి.
ఒకే ఒక్క హిట్ అయిన హీరోయిన్ కి ఆ రేంజ్ లో అడ్వాన్స్ లు ఇవ్వడం అంటే.. అది ఆశ్చర్యకరమే. ఏది అయితే ఏం ఉప్పెన సినిమా కృతిని స్టార్ ను చేసింది. అలాగే స్టార్ హీరోయిన్ల పక్కన నిలబెట్టింది. ఇప్పుడు శ్రీలీల వంతు వచ్చింది. పెళ్లి సందడి అనే డిజాస్టర్ సినిమాతో తెలుగు వెండితెర పై తెరంగేట్రం చేసిన ఈ యంగ్ బ్యూటీకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. కాస్త బొద్దుగా, చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది ఈ కుర్ర భామ.
పైగా డాన్సుల్లో శ్రీలీల ఈజ్ చూస్తే కచ్చితంగా కుర్రాళ్ళ మతి పోగొట్టేలా ఉంది. ఇక ఇప్పటికే రవితేజ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఖారారు అయింది. అలాగే ఆమె ఖాతాలో మరికొన్ని సినిమాలు వాచినట్టు తెలుస్తోంది. శర్వా, నితిన్ సినిమాల్లో కూడా ఆమెకు అవకాశాలు వరుస కడుతున్నాయి. మొత్తమ్మీద నిర్మాతల ఆత్రమే ఈ హీరోయిన్ అదృష్టం అయింది.