Happy Valentine’s Day : ఫిబ్రవరి 14న ప్రేమికులు ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున జంటలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని తమలోని ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమ ఒక అనిర్వచనీయమైన భావోద్వేగం, వెలకట్టలేని సంపద, ప్రపంచాన్ని ముందుకు నడిపించే శక్తి. ఫిబ్రవరి 14 లవర్స్ డే.. మనసులో ఏదో పులకింతకు గురి చేసే పదం. పెళ్లయి ఏళ్లు గడిచినా.. ఇప్పుడే డేటింగ్ ప్రారంభించినా.. సిచ్యుయేషనల్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రేమికుల జీవితాల్లో ఈ రోజుకున్న స్పెషాలిటీనే వేరు. ఫిబ్రవరి 14, ప్రేమికుల దినోత్సవం (లవర్స్ డే), ప్రేమను సెలబ్రేట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన రోజు.
మరి ఇంతటి ఘన చరిత్ర కలిగిన ప్రేమికుల రోజు నాడు.. అందంగా, హృద్యంగా విషెస్ చెప్పారంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ప్రేమికులు ఈ రోజు తమ ప్రియమైన వారికి అందంగా, హృద్యంగా ప్రేమను వ్యక్తపరచాలో అనుకుంటూ, మెసేజెస్, గిఫ్ట్స్ లేదా స్టిక్కర్స్ పంపించే ఆలోచనలు చేస్తుంటారు. ఈ రోజున గూగుల్ ద్వారా వివిధ వాలెంటైన్స్ డే కోట్స్, మెసేజెస్ ఎంచుకుని వాట్సాప్ ద్వారా సులభంగా పంపించవచ్చు.
వాలెంటైన్స్ డే WhatsApp స్టిక్కర్స్ పంపించడమెలా?
* మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లాలి.
* సెర్చ్ బార్‌లో ‘వాలెంటైన్స్ డే స్టిక్కర్లు’ అని టైప్ చేయండి.
* స్క్రీన్‌పై వివిధ వాలెంటైన్స్ డే స్టిక్కర్ల ప్యాక్‌లు కనిపిస్తాయి.
* మీరు నచ్చిన స్టిక్కర్ ప్యాక్‌ని ఎంచుకుని, వాటిని మీ WhatsApp స్టిక్కర్ కలెక్షన్ కి యాడ్ చేయాలి.
* తర్వాత మీ వాట్సాప్ ఓపెన్ చేసి, మీ ప్రియమైన వ్యక్తి అకౌంట్ ఓపెన్ చేసి స్మైలీ సింబల్ పై క్లిక్ చేయండి.
* స్టిక్కర్ ఆప్షన్ ఎంచుకుని, మీరు యాడ్ చేసిన వాలెంటైన్స్ డే స్టిక్కర్‌ను ఎంచుకుని సెండ్ చేయండి.
ఇలా, మీరు చాలా సులభంగా వాట్సాప్ ద్వారా వాలెంటైన్స్ డే స్టిక్కర్లను పంపవచ్చు!
వాలెంటైన్స్ డే వీక్ 2025 తేదీలు:
* 7 ఫిబ్రవరి – రోజ్ డే
* 8 ఫిబ్రవరి – ప్రపోజ్ డే
* 9 ఫిబ్రవరి – చాక్లెట్ డే
* 10 ఫిబ్రవరి – టెడ్డీ డే
* 11 ఫిబ్రవరి – ప్రామిస్ డే
* 12 ఫిబ్రవరి – హగ్ డే
* 13 ఫిబ్రవరి – కిస్ డే
* 14 ఫిబ్రవరి – వాలెంటైన్స్ డే
నేటితో వాలంటైన్ వీక్ పూర్తి అవుతుంది. ఈ వీక్‌లో మీ ప్రేమను మీకు ఇష్టమైన వారికి అందంగా వ్యక్తం చేయండి.