రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. అయితే.. ఎన్ని వ్యాక్సిన్లకు ఆర్డర్ పెట్టారు? ఎంత అమౌంట్ ఖర్చు చేస్తున్నారు? అనే వివరాలను మాత్రం బయట పెట్టట్లేదు. చివరకు విపక్షాలు అడిగినా కూడా.. ఇతర విషయాలు మాట్లాడుతున్నారు తప్ప.. వ్యాక్సిన్ డీటెయిల్స్ చెప్పట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజాగా.. ఇదే అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ.. వ్యాక్సిన్లకు రూ.45 కోట్లు మాత్రమే వెచ్చిస్తున్నారని చెప్పారు. వాటి ద్వారా కేవలం 13 లక్షల డోసులు మాత్రమే కొనుగులు చేస్తున్నారని ఆరోపించారు. ఇంత కొద్దిగా వ్యాక్సిన్ కొనుగోలు చేసి, రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఆదుకుంటారని ప్రశ్నించారు.
విజయసాయిరెడ్డి ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వం 4 కోట్ల వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేయబోతోందంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. విపక్షాల మాదిరిగా మీడియా కథనాలను చూపించడమేంటని ప్రశ్నించారు. వ్యాక్సిన్ కంపెనీలకు ఇచ్చిన ఆర్డర్ పత్రాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కానీ.. ఆయన సైలెంట్ అయిపోయారు. దీంతో.. పైకి చెబుతున్నది వేరు.. వాస్తవం వేరు అన్నది అర్థమవుతోందని నెటిజన్లు వ్యాఖ్యానించారు.
అందరికీ వ్యాక్సిన్ వేస్తామని చెప్పారని.. అందుకోసం రూ.1600 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారని.. ఆ ప్రకారంగానే వ్యాక్సిన్ కొనుగోలు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్లతోనే సరిపుచ్చాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి, దీనిపై జగన్ ఎలా స్పందిస్తారు? వాస్తవాలను బయట పెడతారా లేదా? అన్నది చూడాలి.