మే రెండో వారంలో..
మే రెండో వారం నుంచి సుమారు రోజుకు 8 లక్షల కేసులు నమోదవుతాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే ప్రజలు పిట్టల్లా రాలిపోవడం ఖాయమని పదేపదే హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనే అపవాదు ఎదుర్కొంటున్నాయి. ప్రజలను కాపాడే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వాలు చేపట్టే చర్యలు ఏమిటో చెప్పాల్సిన అవసరం ఉందని అడిగినా పెదవి విప్పడం లేదు. ఫలితంగా ప్రజలే సమిధలై తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
భయం కలిగిస్తున్న సర్వేలు
కరోనా మహమ్మారి వ్యాప్తి గురించి వెల్లడిస్తున్న సర్వేలు భయాందోళన కలిగిస్తున్నాయి. వ్యాక్సినేషన్ వేస్తున్నా ఇంత వేగంగా వైరస్ విస్తరించడం వెనుక గల కారణాలు ఎవరూ విశ్లేషించడం లేదు. ఫలితంగా ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో పలు స్టేట్లు అతలాకుతలం అవుతున్నాయి. మహారాష్ర్ట, పంజాబ్, హర్యాణా, కర్ణాటక, తమిళనాడు వంటి స్టేట్లలో మహమ్మారి విలయతాండం చేస్తోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఏం చేయాలో తోచకుండా ఉండే పరిస్థితి ఎదురవుతోంది.
ఇండియా సిద్ధమేనా?
దేశంలో సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఇండియా థర్డ్ వేవ్ కు సిద్ధమేనా అని పలువురు శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. సెకండ్ వేవ్ కే తల్లడిల్లుతున్న దేశం మూడో దశకు తట్టుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్ విస్తరణపై పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. దీంతో వైరస్ కట్టడికి ప్రభుత్వాలు ఏ మేరకు చర్యలు చేపడతాయో ముందే ప్రజలకు తెలియజేయాలి.
అందుబాటులో లేని డేలా
కరోనా కేసుల విషయంలో ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. దీంతో వైరస్ వ్యాప్తిపై డేలా లేకపోవడంతో ఏ చర్యలు తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వాలు ఖచ్చితమైన సమాచారం ఇవ్వకపోవడంతో తదుపరి చర్యల విషయంలో వెనుకంజ వేయడం పరిపాటిగా మారింది. కరోనా వైరస్ ప్రజలపై తన పంజా విసురుతూ ప్రాణాలను తోడేస్తోంది. దీంతో సామాన్యులు సమిధలై పోతున్నారు. శాస్ర్తవేత్తల హెచ్చరికలు గమనించి వైరస్ వ్యాప్తి అరికట్టే చర్యలకు ఉపక్రమించడం తప్ప ప్రభుత్వాలకు మరో మార్గం లేదన్నది జగమెరిగిన సత్యం.