డిసెంబర్ నాటికి వ్యాక్సిన్.. భారత్ ఊపిరి పీల్చుకో!

చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఎందరో మనుషుల ప్రాణాలను బలిగొన్నది. భారత్ లో ప్రస్తుతం రోజుకు 60 వేలకు పైగా కేసులు నమోదవుతూ వందలాది మంది ప్రాణాలను విడుస్తున్నారు. ఈ తరుణంలో కరోనా మహమ్మారిని తరిమేందుకు ఇప్పటికే అమెరికా, రష్యాలు వ్యాక్సిన్ తయారీలో ముందున్నాయి. రష్యాలో వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలు జరుగుతుండగా., అమెరికాలో కొంతకాలంగా ప్రయోగాలను నిలిపి ఆ తరువాత మళ్లీ ప్రారంభించారు. ఇక భారత్ లో తాజాగా […]

Written By: NARESH, Updated On : October 19, 2020 9:04 am
Follow us on

చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఎందరో మనుషుల ప్రాణాలను బలిగొన్నది. భారత్ లో ప్రస్తుతం రోజుకు 60 వేలకు పైగా కేసులు నమోదవుతూ వందలాది మంది ప్రాణాలను విడుస్తున్నారు. ఈ తరుణంలో కరోనా మహమ్మారిని తరిమేందుకు ఇప్పటికే అమెరికా, రష్యాలు వ్యాక్సిన్ తయారీలో ముందున్నాయి. రష్యాలో వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలు జరుగుతుండగా., అమెరికాలో కొంతకాలంగా ప్రయోగాలను నిలిపి ఆ తరువాత మళ్లీ ప్రారంభించారు.

ఇక భారత్ లో తాజాగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇటీవల ఓ ప్రకటన చేసింది. డిసెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ వస్తుందని తేల్చి చెప్పింది. 2021 మార్చి నాటికి మిలియన్ల కొద్దీ  మోతాదులో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్ట్ సంయుక్తంగా కలసి అభివ్రుద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ను సీరమ్ ఇనిస్టిట్యూట్ భారత్ లో ‘కోవిషీల్డ్’ పేరుతో అందుబాటులోకి తీసుకురానుంది.

అయితే వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో 70 మిలియన్ల డోసులు అందుబాటులో ఉంటుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. ఈ మేరకు ఐసీసీఐడీడీ సహకారంతో హీల్ ఫౌండేషన్ ‘ఇండియా వ్యాక్సిన్ యాక్సెసిబిలిటీ’ సమ్మిట్ను నిర్వహించింది. బ్రిటిష్ -స్విడిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా సహకారంతో జెన్నర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆక్స్ ఫర్ట్ యూనివర్సిటీ అభివ్రుద్ది చేసిన వ్యాక్సిన్ రు ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదుర్చుకొంది. ఇందులో భాగంగా భారత్లో ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ ను నిర్వహిస్తోంది.

ఇదిలా ఉండగా మరో మూడు వ్యాక్సిన్లు కూడా కీలక దశకు చేరుకున్నాయి. వీటిలో ఒకటి మూడోదశ ట్రయల్స్ లో ఉండగా మరొకటి రెండో దశ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇక రష్యాకు చెందిన ‘స్పుత్నిక్’ ను భారత్లో ట్రయల్స్ నిర్వహించడానికి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్ డీ ఐ ఎఫ్)తో డ్రగ్ కంట్రలో జనరల్ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీ తెలిపింది. దీంతో త్వరలోనే ఇండియాలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అయితే అప్పటి వరకు జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.