Vaccination: కరోనా నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో కేసుల సంఖ్య పెరగడంతో పాఠశాలల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో విద్యార్థుల చదువుల సంగతి అంతేనేమో. ఒమిక్రాన్ వేరియంట్ కూడా భయం సృష్టిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు టీకాల కార్యక్రమం వేగవంతం చేసిన సందర్భంలో పిల్లల భవితపై సర్కారు నిర్ణయం తీసుకోనుంది. వారికి కూడా టీకాలు వేసేందుకు సంకల్పించింది.

ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ వేసేందుకు ముందుకు రావడంతో అందరిలో హర్షం వ్యక్తం అవుతోంది. కరోనా మహమ్మారి ప్రభావంతో రెండేళ్లుగా పాఠశాలల పరిస్థితి అధ్వానంగా మారింది. పాఠశాలల మూసివేతతో చదువులు ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమంతో కొంత ఊరట లభించనుంది.
Also Read: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కరోనా.. అప్రమత్తంగా ఉండాలని సూచన
గత ఏడాది జనవరి 16 నుంచి టీకాలు వేసే కార్యక్రమం చేపట్టగా సరిగా ఏడాదికి యుక్త వయసు వారికి కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడంతో అందరు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ తో పాటు స్పుత్నిక్ టీకా కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో కరోనా వ్యాక్సిన్ ప్రభావంతో దాన్ని సమర్థంగా ఎదుర్కొనే సత్తా ఉందని అందరు సగర్వంగా చెబుతున్నారు. ప్రస్తుతం టీనేజర్లకు కూడా టీకా అందుబాటులోకి రావడంతో చదువులకు ఇక ఢోకా లేదని తెలుస్తోంది.
ఈనెల 10 నుంచి మూడో డోసు అందుబాటులోకి రానుంది. దీంతో రెండు డోసులు పూర్తి చేసుకున్న వారు మూడో డోసు తీసుకోవాల్సిందే. దీంతో కరోనాను దూరం చేయొచ్చని చెబుతున్నారు. రెసిడెన్సియల్ స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థులకు పెద్ద ఎత్తున టీకా వేసే కార్యక్రమం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా 8 లక్షల మంది పిల్లలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో వారందరికి వ్యాక్సిన్ డోసులు వేసేందుకు ఆరోగ్య శాఖ సన్నద్ధమవుతోంది.
Also Read: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లో దీప్తి కన్నీళ్లు.. వైరల్