
వ్యాక్సిన్ల కొరతతో తెలంగాణలో కొత్త వారికి వ్యాక్సినేషన్ వేయడాన్ని ఆపు చేయించారు.కేవలం మొదటి డోసు తీసుకున్న వారికి మాత్రమే రెండో డోసును వేస్తున్నారు. కొద్దిరోజులుగా ఆగిపోయిన ఈ వ్యాక్సినేషన్ ను ఈరోజు ప్రారంభించారు. మొదటగా తెలంగాణలో కరోనాకు గురయ్యే సూపర్ స్ప్రైడర్లకే వ్యాక్సిన్ వేస్తున్నారు. కరోనాతో అధిక ప్రమాదం ఉన్నవారికే మొదట ప్రాధాన్యం ఇస్తున్నారు. శుక్రవారం తెలంగాణలోని ఆరోగ్య అధికారులు ప్రత్యేక కోవిడ్ -19 టీకా డ్రైవ్‌ను ప్రారంభించారు. హై డ్రైవ్ రిస్క్ గ్రూపులకు చెందిన 7.87 లక్షల మందికి టీకాలు వేసినట్టు తెలిపారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా 7-8 రోజులు కొనసాగుతుంది.
హైదరాబాద్‌లోని రెండు ప్రత్యేక టీకా కేంద్రాలను సందర్శించిన ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ వచ్చే మూడు రోజుల్లో జిల్లాల్లో 1.4 లక్షలకు పైగా ప్రజలకు టీకాలు వేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సూపర్ స్ప్రేడర్స్ అని పిలువబడే హై రిస్క్ గ్రూపులకు ప్రత్యేక టీకా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ లబ్ధిదారులను కవర్ చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలో 32 ప్రత్యేక టీకా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో రోజూ 30,000 మందికి టీకాలు వేస్తామని తెలిపారు.
బయట తిరిగే సూపర్ స్ప్రైడర్లు అయిన 3 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు, ఆటోరిక్షా డ్రైవర్లు, 80,000 మంది కూరగాయలు, మాంసం, పూల మార్కెట్లు, కిరణా మరియు సెలూన్ షాపుల్లో పనిచేసే వారు.. మూడు లక్షల మంది కార్మికులు, ఎరువులు, పురుగుమందుల దుకాణా దారులైన 30,000 మంది.. 20,000 మంది జర్నలిస్టులకు టీకాలు వేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈరోజు హైదరాబాద్ లోని రెడ్ రోజ్ ఫంక్షన్ ప్యాలెస్‌ను సందర్శించి టీకా కేంద్రాన్ని పరిశీలించారు, ఇక్కడ అధిక ప్రమాదం.. అధిక కరోనాకు గురయ్య వారికి టీకా మొదటి మోతాదు ఇచ్చారు.
అధికారులు గుర్తించిన లబ్ధిదారులకు టీకా కోసం మొదట కూపన్లు ఇస్తున్నారు. అందరికీ టీకా వేసుకునేందుకు అనుమతి లేదు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై సోమేశ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు టీకాలు వేయడానికి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ఆయా వర్గాల వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక తెలంగాణలోని జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా టీకాలను ఈరోజు వేశారు. జర్నలిస్టులకు టీకాలు వేస్తున్న సోమజిగుడలోని ప్రెస్ క్లబ్‌ను కూడా సోమేష్ కుమార్ సందర్శించి టీకా పంపిణీని పరిశీలించారు. .