Homeఆంధ్రప్రదేశ్‌Shock to YCP: ఉత్తరాంధ్ర.. రాయలసీమ లో వైసిపికి షాక్ తాజాగా శ్రీ ఆత్మ సాక్షి...

Shock to YCP: ఉత్తరాంధ్ర.. రాయలసీమ లో వైసిపికి షాక్ తాజాగా శ్రీ ఆత్మ సాక్షి సర్వే లో వెల్లడి

Shock to YCP: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఓటర్ల నాడి పట్టేందుకు పలు సంస్థలు పోటీ పడుతుంటాయి. పార్టీలు సొంతంగా చేసుకునే సర్వేలు కొన్ని అయితే, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కొన్ని సంస్థలు అయా రాష్ట్రాల్లోని పరిస్థితులు, ఓటర్ల నాడి పట్టేందుకు సర్వేలు ఎప్పటికప్పుడు చేస్తుంటాయి. రాష్ర్టంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థతులు, ఓటర్ల పల్స్ పట్టేందుకు కొద్ది రోజులు శ్రీ ఆత్మ సాక్షి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సర్వే చేపట్టింది. ఈ సర్వేలో అధికార పార్టీకి రెండు ప్రాంతాల్లోని ఓటర్లు జెల్ల కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తేలింది. అధికార పార్టీ పట్ల ఈ రెండు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నట్టు శ్రీ ఆత్మ సాక్షి సర్వేలో తేలింది.
ఉత్తరాంధ్రలో తీవ్ర వ్యతిరేకత..
శ్రీ ఆత్మ సాక్షి సంస్థ ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో ఈ సర్వేను చేపట్టింది. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసీపీకి 44.50 శాతం మంది ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉంటే, 53.50 శాతం మంది ప్రభుత్వం పట్ల తను వ్యతిరేకతను వ్యక్తం చేసినట్లు తాజా సర్వేలో వెల్లడైంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 34 నియోజకవర్గాల్లో అధికార పార్టీకి గట్టి దెబ్బ తగ్లుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో 28 సీట్లను గెలుచుకుని వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే, తాజా సర్వే ను బట్టి చూస్తే భారీగానే వైసీపీ సీట్లకు గండి పడే అవకాశం కనిపిస్తోంది.
రాయలసీమలోను వ్యతిరేకత.. 
తాజా శ్రీ ఆత్మసాక్షి సర్వేలో రాయలసీమ ప్రాంతంలోనూ అధికార వైసిపికి ఎదురు దెబ్బ తగలనున్నట్టు తేలింది. ఇక్కడ రాజకీయంగా చోటు చేసుకున్న పలు పరిణామాలు అధికార పార్టీకి మైనస్ అవుతున్నట్లు సర్వేలో తేలింది. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారంతోపాటు వీర శివారెడ్డి వంటి నేతలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండడం అధికార పార్టీ ఓటు బ్యాంకును దెబ్బతీస్తున్నట్లు సర్వేలో వెళ్లడయింది. గత ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లో గణనీయమైన ఓట్లతో భారీగా సీట్లు సంపాదించిన వైసీపీకి ఈసారి ఈ ప్రాంతంలో గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని, ఆ దిశగా ఓటర్ల మూడ్ సర్వేలో వెళ్ళడైనట్టు శ్రీ ఆత్మసాక్షి పేర్కొంది.
వ్యతిరేక ఓటు బ్యాంకు కలిసి వచ్చేలా..
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అధికార పార్టీ పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని ఏ పార్టీ క్యాష్ చేసుకుంటుందన్న చర్చ నడుస్తోంది. అధికార పార్టీ పట్ల వ్యతిరేకత చూపిస్తున్న ఓటర్లు టిడిపి, జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే ఈ రెండు పార్టీలు పొత్తులో భాగంగా కలిసి పోటీ చేస్తే పెద్ద ఎత్తున ఇరు పార్టీలకు లబ్ధి చేకూరేందుకు అవకాశం ఉంది. పొత్తు ప్రయత్నాలు వికటించి విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు ఎవరి వైపుకు మల్లుతుందన్న చర్చ నడుస్తోంది.
బలమైన శక్తిగా జనసేన..
గత ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లతో ఒకే ఒక సీటుకు పరిమితమైన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఆవిర్భవిస్తుందని ఈ సర్వేలో తేలింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన పార్టీ భారీ ఓటు బ్యాంకును సాధించిందని, ఇది ఆ పార్టీ ఎక్కువ సీట్లు సాధించేందుకు అవకాశం వుందని ఈ సర్వేను బట్టి నిపుణులు విశ్లేషిస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular