UP Elections 2022: దేశంలో ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంల పార్టీలు విజయం కోసం శ్రమిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్ లలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ దేశంలోనే పెద్ద రాష్ట్రం కావడంతో ఇక్కడ పట్టు సాధించాలని బీజేపీ చూస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ జయకేతనం ఎగురవేసింది. దీంతో అదే ఒరవడి సాధించాలని భావిస్తోంది. దీని కోసం అహర్నిశలు శ్రమిస్తోంది.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి ఏకైక పార్టీగా అవతరించి అధికారం హస్తగతం చేసుకుంది. దీంతో దేశంలో కూడా మెజార్టీ స్థానాలు దక్కించుకుని హవా కొనసాగించింది. ఈసారి కూడా అదే విధంగా పెద్ద మొత్తంలో సీట్లు గెలుచుకుని మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని భావిస్తోంది. ఇందుకు గాను ప్రణాళికలు రచిస్తోంది.
Also Read: UP Elections 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపెవరిది?
రేపటి నుంచి ఎన్నికలు నిర్వహించనుంది. ఇందులో ఎక్కువ సీట్లు సొంతం చేసుకోవాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సర్వేలు సైతం బీజేపీ, ఎస్పీ మధ్యే పోటీ ఉంటుందని చెబుతుండటంతో ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని చూస్తోంది. ఇందుకు గాను అన్ని మార్గాలను అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది.
ఇప్పటికే ప్రచార పర్వం దాదాపుగా ముగిసినట్లే. ఓటర్లను ప్రసన్నంచేసుకునే ప్రయత్నంలో భాగంగా కేంద్ర మంత్రులు సైతం ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, సీఎం ఆదిత్యనాథ్ తదితరులు ప్రచారంలో పాల్గొని ఓటర్లను ప్రభావితం చేశారు. ఈ నేపథ్యంలో యూపీలో బీజేపీని ముందంజలో నిలిపేందుకు నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
Also Read: UP Elections 2022: కులాల కుంపటిలో యూపీ ఎన్నికలు
80 లోక్ సభ స్లానాలుండటంతో ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఇక తిరుగులేదని తెలుస్తోంది. అందుకే ఇక్కడ ఎన్నిసీట్లు గెలుచుకుంటే అంత బలం వస్తుంది. దీంతో బీజేపీ కూడా ఎక్కువ సీట్లు గెలుచుకుని 2024 ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. ఇప్పుడు ఎన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుంటే అంత బలం అప్పుడు పెరుగుతుందని భావించి అధిక సీట్లు గెలుచుకునేందుకు పోటీ పడుతోంది.