Driving License: బండి తీసుకుని బయటకు వెళ్లామంటేనే ఒకింత టెన్షన్ పుడుతుంది. ఎందుకంటే మన దగ్గర ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు. లైసెన్స్ ఉంటే ఆర్సీ ఉండదు. ఇలా ఏదో ఒకటి మిస్ అయి ఎక్కడ పోలీసులకు చిక్కుతామో అనే టెన్షన్ అయితే మనలో ఉంటుంది. అయితే ఇలా ఏదో ఒక పొరపాటు చేసి పోలీసులకు చిక్కనప్పుడు కూడా కొన్ని చట్ట పరమైన విధానాలు మనకు తెలిసి ఉంటే మాత్రం మనం ఈజీగా బయట పడొచ్చు.

1988 సెక్షన్ 128 చట్ట ప్రకారం.. ఒక బైక్ మీద ఇద్దరు మాత్రమే వెళ్లాలి. ఇక కారులాంటి వెహికల్ లో అయితే నలుగురికి ఛాన్స్. కాగా బైక్ మీద వెళ్లేటప్పుడు ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాలి. కాగా మన దగ్గర అయితే నడిపేవారు కూడా హెల్మెట్ పెట్టుకోరు. దాంతో మన దేశంలో ఏడాదికి ఇలా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల దాదాపు లక్షన్నర మంది మరణిస్తున్నారంట.
Also Read: భర్త లైంగిక దాడి చేస్తుంటే భార్య వీడియో చిత్రీకరణ.. విజయవాడలో దారుణం
ఇక మరో చట్టం ఏంటంటే.. సాధారణంగా మనం ఏవైనా రూల్స్ అతిక్రమించినప్పుడు పోలీసులు మన బైక్ లేదంటే కారు కీ లాక్కుంటారు. చలానా కట్టేదాకా వదిలిపెట్టరు. అయితే ఇలాంటప్పుడు మనం వాస్తవం తెలియక సైలెంట్ గా ఉంటాం. కానీ చట్టం ప్రకారం వారు చేసేది తప్పు. అలాంటప్పుడు మనం సదరు అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.

ఈ పాయింట్ మీకందరికి సంతోషాన్ని కలిగిస్తుంది.. సాధారణంగా మనం రూల్ అతిక్రమించినా లేదంటే చలానా కట్టకపోతే ట్రాఫిక్ పోలీసులు మన కారు లేదా బైక్ కీ లాక్కుంటారు.. మనం బిక్కముఖాలు వేసుకుని నిల్చుంటాం.. కానీ అది చట్టవిరుద్దం. మనం సదరు అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పూర్తి హక్కు ఉంటుంది.
Also Read: బాలీవుడ్ క్రేజీ ఆఫర్లు రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్లు వీళ్ళే !
అయితే మీ దగ్గర లైసెన్స్ లేకపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. ఇక్కడే చాలామది పొరపాటు చేస్తారు. పోలీసులు వేసిన ఫైన్ కట్టకుండా.. ఐదు రోజుల్లో మీరు ఫైన్ వేసిన సదరు ఆఫీసర్ కు లైసెన్స్ చూపించి ఆ ఫైన్‌ను కట్టకుండా తప్పించుకోవచ్చు. అయితే మీరు చూపించలేకపోతే మాత్రం కచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే. కాగా మద్యం తాగి దొరకితే మాత్రం 1988, సెక్షన్ 185, 202 ప్రకారంగా మీ బ్లడ్ లో 30మిగ్రాముల కంటే ఆల్కాహాల్ ఎక్కువగా కనిపిస్తే మాత్రం మీకు శిక్ష తప్పదు.
[…] Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ రియల్-ఎస్టేట్ సంస్థ చిరును తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని కోరడంతో ఆయన ఒప్పుకున్నారట. ఇందుకోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని, ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరిందని సమాచారం. రియల్-ఎస్టేట్ సంస్థ పనితీరు నచ్చడంతోనే చిరు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ఓకే చెప్పారట. […]