కేసీఆర్ ప్రజలను భ్రమపరుస్తున్నారు!

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపి ప్రజలను భ్రమపరుస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. అదే విధంగా కొవిడ్‌-19 పరీక్షలను కూడా తక్కువ సంఖ్యలో చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలకు, వలస కార్మికులకు సరైన వసతి.. సదుపాయాలు కల్పించి ఇక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వారు వెళ్లిపోతే రాష్ట్రం చాలా నష్టపోతుందన్నారు. కరోనా నివారణ, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని, […]

Written By: Neelambaram, Updated On : May 5, 2020 7:42 pm
Follow us on

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపి ప్రజలను భ్రమపరుస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. అదే విధంగా కొవిడ్‌-19 పరీక్షలను కూడా తక్కువ సంఖ్యలో చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు.

రాష్ట్ర ప్రజలకు, వలస కార్మికులకు సరైన వసతి.. సదుపాయాలు కల్పించి ఇక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వారు వెళ్లిపోతే రాష్ట్రం చాలా నష్టపోతుందన్నారు. కరోనా నివారణ, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని, కరోనా పరీక్షలను తక్కువ చేసి చూపడం తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌ తమిళిసైకి ఉత్తమ్‌ వినతిపత్రం ఇచ్చారు.

రాష్ట్రంలో వలస కార్మికులు ఎంతమంది ఉన్నారన్నదానిపై ప్రభుత్వానికి సరైన అంచనా లేదని విమర్శించారు. 3.50 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని సీఎం కేసీఆర్‌ పేర్కొనగా.. 6 లక్షల మంది ఉన్నారని అధికారులు, 15 లక్షల మంది ఉన్నారని మంత్రి తలసాని చెబుతున్నారని అన్నారు. రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5 వేల సాయం అందేలా చూడాలని గవర్నర్‌ ను కోరామని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలు ఎక్కువ సంఖ్యలో టెస్ట్‌లు చేస్తున్నాయని చెప్పారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.