US Visa : అమెరికా వెళ్లాలని కలలు కంటున్నారా.. అయితే మీకు ఓ గుడ్ న్యూస్. 2025లో అమెరికా వీసా పొందేందుకు హైదరాబాద్ నుంచే దారి ఈజీ కానుందట. అవును, తాజా నివేదికల ప్రకారం.. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాదులో వీసా కోసం వెయిటింగ్ టైం చాలా తక్కువగా ఉంది. అమెరికా వెళ్లాలంటే వీసా ప్రయత్నాలకు ఇక్కడి నుంచి ట్రై చేస్తే బెటరేమో.
అక్రమంగా వచ్చేవాళ్లు, అక్కడి నుంచి పంపించేయడాలు, వీసాలు ఇవ్వడాలు గందరగోళంగా ఉన్నసమయంలో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ గ్లోబల్ వీసా అపాయింట్‌మెంట్ వెయిటింగ్ టైమ్స్ ఛేంజ్ చేసింది. ఈ మార్పులు ఏప్రిల్ 25 నుంచే అమల్లోకి వచ్చాయి. ఇంతకుముందు నెలలో ఇంటర్వ్యూకి ఎంత టైమ్ పట్టిందో, ఇప్పుడు టూరిస్ట్ వీసా అపాయింట్‌మెంట్ ఎప్పుడు దొరుకుతుందో ఈ అప్ డేట్లో చెప్పారు.
Also Read : అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వీసాల రద్దుకు బ్రేక్!
ఈ అప్‌డేట్స్ ప్రకారం, చెన్నై, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీలో ఉన్న వీసా సెంటర్లతో పోలిస్తే, హైదరాబాద్ లో అమెరికా వీసా కోసం అప్లై చేస్తే త్వరగా వచ్చేలా ఉంది. హైదరాబాద్, ముంబై సెంటర్లలో అయితే తక్కువగా ఏడున్నర నెలల వెయిటింగ్ టైం ఉంది. అదే చెన్నైలో అయితే 11 నెలలు పడుతోంది. అలాగే, దేశంలో ఉన్న ఐదు సెంటర్లలో హైదరాబాద్‌లో మాత్రమే ఇంటర్వ్యూ కోసం త్వరగా, అంటే ఏడున్నర నెలల్లోనే అపాయింట్ మెంట్ దొరుకుతుంది.
బి-1 (బిజినెస్), బి-2 (టూరిజం) లేదా ఈ రెండూ కలిసిన వీసాల కోసం అప్లై చేసేవాళ్లు, ఇంటర్వ్యూకి వెళ్లాల్సిన అవసరం లేకపోతే తప్పకుండా స్వయంగా ఇంటర్వ్యూకి వెళ్లాలి. ఒక్కో చోట ఒక్కోలా వెయిటింగ్ టైమ్ ఉంటుందని, కాన్సులేట్ సిబ్బంది, వాళ్ల పనిని బట్టి ఇది మారుతుందని తెలుస్తోంది.
ఇండియాలో ఉన్న యూఎస్ ఎంబసీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌లోని కాన్సులేట్‌లు ఎప్పటికప్పుడు కొత్త అపాయింట్‌మెంట్ స్లాట్‌లు రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఇంటర్వ్యూకి డేట్ తీసుకున్నవాళ్లు, వీలైతే ముందు డేట్ కోసం సిస్టమ్‌ని తరచూ చెక్ చేసుకోవాలని చెబుతున్నారు.
Also Read : అమెరికా వీసా రూల్స్.. జీవిత భాగస్వామి వీసా అంత ఈజీకాదు..