https://oktelugu.com/

Donald Trump : మూడో ప్రపంచ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన.. ఇంతకీ ఏమన్నారంటే ?

Donald Trump : ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు వచ్చాయి. దీంతో చాలా దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి. ఆస్తి, ప్రాణ నష్టం భారీగా సంభవించింది. ఇప్పటికే ఆ యుద్ధాల నుంచి కొన్ని దేశాలు తేరుకోనే లేదు.

Written By: , Updated On : February 22, 2025 / 12:37 PM IST
Donald Trump

Donald Trump

Follow us on

Donald Trump : ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు వచ్చాయి. దీంతో చాలా దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి. ఆస్తి, ప్రాణ నష్టం భారీగా సంభవించింది. ఇప్పటికే ఆ యుద్ధాల నుంచి కొన్ని దేశాలు తేరుకోనే లేదు. ఈ క్రమంలోనే మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా రావొచ్చన్న సంకేతాలు ఉండనే ఉన్నాయి. కారణం గత కొంత కాలంగా కొన్ని దేశాల మధ్య సుధీర్ఘంగా యుద్ధాలు జరుగుతుండడమే. రెండు దేశాల మధ్య యుద్ధాలు కాస్త అవి ఇతర దేశాలకు పాకుతూ.. రాను రాను ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇందులో కొన్ని దేశాల మధ్య దురుద్దేశాలు ఉండడమే ప్రపంచ యుద్ధాలకు కారణమని తెలుస్తుంది. ఈ యుద్ధాలు మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇదే క్రమంలో అమెరికా అమెరికా కొత్త అధ్యక్షుడు మూడో ప్రపంచ యుద్ధం గురించి చేసిన కామెంట్స్ అందరినీ షాక్ కు గురిచేశాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మయామీలో మాట్లాడుతూ.. మూడో ప్రపంచ యుద్ధం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఎంతో సమయం లేదని అయితే తాను అధ్యక్షుడిగా ఉండగా దానిని రాకుండా నివారిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల నాయకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. మయామిలో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ సమ్మిట్‌లో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఒక విధంగా వాస్తవానికి కొంత దూరంగానే ఉన్నాయన్న వాదన వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటికే ప్రపంచంలో అనేక దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చాలామంది చెబుతున్నారు.

తన నాయకత్వంలో ఇలాంటి విపత్తును రాకుండా అడ్డుకుంటానని అమెరికా అధ్యక్షుడు ప్రపంచానికి హామీ ఇచ్చారు. రష్యా ఉక్రెయిన్, ఇరాన్ ఇరాక్ సహా ప్రపంచ వ్యాప్తంగా దేశాల్లో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్న క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తాను ఈ యుద్ధాలను ఆపి శాంతిని స్థాపించడం కర్తవ్యమన్నారు.పెద్ద మొత్తంలో జనాలు చనిపోతుండడం చూసి తాను తట్టుకోలేకపోతున్నానని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందుకే ఈ యుద్ధాలను అంతం చేయడానికి తాను అత్యవసర చర్యలు తీసుకుంటున్నానన్నారు.

ఈ సమ్మిట్ లోనే ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు జో బిడెన్ పై కూడా నిప్పులు చెరిగారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు రావడానికి బైడెన్ పరిపాలనే కారణమని దుయ్యబట్టారు. బైడెన్ అధ్యక్షుడిగా మరో ఏడాది ఉండి ఉంటే కచ్చితంగా థర్డ్ వరల్డ్ వార్ వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. ప్రపంచం ప్రశాంతంగా ఉండటానికి తాను కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. యుద్ధాలను అంతం చేయడమే తన లక్ష్యం అంటూ ట్రంప్ పేర్కొనడం ప్రపంచ దేశాల నేతల నుంచి ప్రశంసలు కురిపిస్తుంది. ఈ క్రమంలోనే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి అమెరికా చర్చలు జరుపుతోందని అన్నారు.