అగ్రరాజ్యమైన అమెరికాలో ఎన్నికల ఘంటలు మోగుతున్నాయి. ఎలక్షన్లకు టైం రానే వచ్చింది. మరికొద్ది రోజుల్లోనే అగ్రదేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగేళ్లకోసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనా, ఫలితాలపైనా అందరికీ ఆసక్తి ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ మరోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో నిలిచారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్ పోటీలో ఉన్నారు.
Also Read: విమానం ప్రమాదంలో 25 మంది మృతి
ఈ ఎన్నికల్లో ఆమెరికన్లు బిడెన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సర్వేల్లో స్పష్టమవుతోంది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మాటలయుద్ధం చేస్తున్నట్లు వెల్లడవుతోంది. గతంలో ఉపాధ్యక్షుడిగానూ పనిచేసిన అనుభవం ఉన్న బిడెన్ తనకు గట్టి ప్రత్యర్థిగా భావిస్తున్న ట్రంప్.. గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేస్తూ టార్గెట్ చేస్తున్నారు. ఈసారి అమెరికా ఎన్నికల్లో కరోనా వైరస్, ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు, నిరుద్యోగం ప్రధాన ఎజెండాగా మారాయి. ట్రంప్ కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడంలో విఫలమయ్యాడన్న అపవాదు మూటగట్టుకున్నారు.
అమెరికాలో అన్ని సర్వే సంస్థలు ఓటర్ల నాడిని తెలుసుకునే పనిలో పడ్డాయి. అన్ని జాతీయ సర్వేల్లో జోబైడెన్ ప్రత్యర్థి ట్రంప్ కంటే పైచేయి సాధించారు. అన్ని సర్వేల్లో సరాసరిగా జైబెడైన్ కు 50శాతం ఓట్లు వస్తే.. ఆయన ప్రత్యర్తి ట్రంప్ కు 40శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. జార్జియా, టెక్సాస్ రాష్ట్రాల్లో మాత్రమే జోబైడెన్ కంటే ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. మిగత రాష్ట్రాల్లో జోబైడెన్ దే ఆధిపత్యం. యుద్ధభూమి అనే పేర్కొనే రాష్ట్రాల్లో మిగతా వాటికంటే ఎక్కువ ఎలక్ట్రోరల్ ఓట్లు ఉంటాయి. అభ్యర్థులు అక్కడే ఎక్కువగా ప్రచారం చేస్తారు. ప్రస్తుతం యుద్ధభూమి రాష్ట్రాల్లో జోబైడెన్ ఆధిపత్యం ఉంది. మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యం ఉంది.
Also Read: చైనా వాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు.!
అమెరికాలో ఓట్లు ఎక్కువగా వచ్చినా ఆ అభ్యర్థి గెలుస్తాడని చెప్పలేం. ఎందుకంటే 2016లో ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్ కు ఏకంగా 30 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. అయినా అమెరికాలోని ఎలక్ట్రోరల్ కాలేజీ వ్యవస్థలో ట్రంప్ ఎక్కువ ఓట్లు తెచ్చుకొని అధ్యక్షుడయ్యారు.. అమెరికా ఎలక్ట్రోరల్ కాలేజీలో మొత్తం 538 ఓట్లు ఉంటాయి. ఒక అభ్యర్థి గెలవాలంటే 270 ఓట్లు సంపాదించాలి. ఇప్పుడు చాలా సర్వేలు పక్కాగా లెక్కలువేస్తున్నాయి. 2016లో హిల్లరీ క్లింటన్ ముందంజలో నిలిచారు. కానీ ట్రంప్ గెలిచాడు. ఈసారి ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. సర్వేల్లో మాత్రం జోబైడెన్ ముందజంలో ఉన్నారు. ట్రంప్ వెనుకబడ్డారు. ఏం జరుగుతుందనేది నవంబర్ 3న ఓటర్ల తీర్పుతో నిక్షిప్తం అవుతుంది.