Nari Nari Naduma Murari Twitter Talk: చాలా కాలం నుండి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరోల్లో ఒకరు శర్వానంద్(Sharwanand). ఇతను పూర్తి స్థాయి కమర్షియల్ సక్సెస్ ని అందుకొని దాదాపుగా పదేళ్లు అయ్యింది. ఈ పదేళ్లలో ఒకటి రెండు యావరేజ్ సినిమాలు ఉన్నాయి కానీ, అత్యధిక శాతం డిజాస్టర్ సినిమాలే ఉన్నాయి. అలాంటి శర్వానంద్ నుండి నేడు నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari Movie) చిత్రం విడుదలైంది. కాసేపటి క్రితమే ప్రీమియర్ షోస్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సంక్రాంతికి ఏకంగా 5 సినిమాలు ఉండడంతో థియేటర్స్ ఈ చిత్రానికి దొరకడం చాలా కష్టమైంది. వైజాగ్ లాంటి సిటీ లో సింగల్ స్క్రీన్స్ నుండి ఈ చిత్రానికి కేవలం మూడు షోస్ మాత్రమే దొరికాయి అంటనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఎలాంటి పోటీ ని ఎదురుకుంటుంది అనేది. అయితే ఈ చిత్రాన్ని చూసిన నెటిజెన్స్ ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు వచ్చిన రివ్యూస్ ని ఒకసారి పరిశీలిద్దాం.
#NariNariNadumaMurari : The team has a super entertainer and a winner in hand, which has great potential to work like #Samajavaragamana. The production team needs to do aggressive promotions to take the film to a wider audience.
— TrackTollywood (@TrackTwood) January 14, 2026
ట్విట్టర్ ఆడియన్స్ అందిస్తనున్న టాక్ ని బట్టీ చూస్తే ఈ చిత్రం కూడా పాస్ అయినట్టే అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ బాగుందని, కొన్ని చోట్ల కామెడీ బాగా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు, కానీ ప్రతీ 20 నిమిషాలకు వచ్చే ట్విస్టులు చూసి ఆడియన్స్ కాస్త అయోమయ్యాం కి గురయ్యారని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్టైన్మెంట్ గా సాగిందో, సెకండ్ హాఫ్ అంతకంటే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో సాగిందని, ఈరోజు విడుదలైన నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ కంటే ఈ చిత్రమే బాగుందని, కానీ కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందో లేదో అని భయపడుతున్నారు మేకర్స్. ఎందుకంటే ఇప్పటికే రెండు సంక్రాంతి సినిమాలకు జనాల్లో పాజిటివ్ టాక్ అద్భుతంగా వచ్చింది. టికెట్ సేల్స్ కూడా వేరే లెవెల్ లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలను దాటుకొని ‘నారీ నారీ నడుమ మురారి’ కి టాక్ రావడం కష్టం అని అంటున్నారు.
#NariNariNadumaMurari Positive reports #Sharwanand pic.twitter.com/APVwOwmTIV
— TeluguBoxOffice (@TeluguBoxOffie) January 14, 2026
ఈ సినిమాని విడుదలకు ముందు సరైన రీతిలో ప్రొమోషన్స్ చేయడం లో మూవీ టీం ఘోరంగా విఫలమైందని అంటున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు రామ్ అబ్బూరి. ఆయన గత చిత్రం ‘సామజవరగమనా’. శ్రీ విష్ణు హీరో గా నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఆ రేంజ్ లో హిట్ అవ్వడానికి ప్రధాన కారణం మూవీ టీం చేసిన ప్రొమోషన్స్. ఆ రేంజ్ ప్రమోట్ చేసి ఉండుంటే ఈ సినిమా లెవెల్ వేరేలా ఉండేదని, ఇప్పుడు ఇంత ఇరుకు రిలీజ్ లో టాక్ రావడం, అది వ్యాప్తి చెందడం అనేది చాలా కష్టమైన విషయమని అంటున్నారు విశ్లేషకులు. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 1500 టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇది మంచి ట్రెండ్. రేపు ఎలా ఉండబోతుందో చూడాలి.
Sharwa scores again with a blockbuster entertainer. The comedy with Satya was one of the best parts of the film. From his entry till the hospital scene, every moment was hilarious. The interval was perfectly placed and felt completely massy.!❤️ #NariNariNadumaMurari pic.twitter.com/ZwSJ42iSmC
— Adarsh (@Adarsh_Offcl) January 14, 2026
#NariNariNadumaMurari
Finally @ImSharwanand anna comeback ichadu .
Proper sankranti entertainer .
Satya and vennala kishore comedy worked very well .
Samyukta menon baga act chesindi . Sree Vishnu cameo baga work ayyindi pic.twitter.com/HciVo5YxX1— Rishi (@Rishii1309) January 14, 2026
