https://oktelugu.com/

తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు.. చంద్రబాబుకు షాక్

తెలంగాణలో దుకాణం సర్దేసి ఏపీకి వెళ్లి రాజకీయం వెళగబెడుతున్న చంద్రబాబుకు ఇది అనుకోని షాక్ లా మారింది. కేసీఆర్ ‘ఓటుకు నోటు’ దెబ్బకు తెలంగాణను వదిలిపోయిన చంద్రబాబు ఇటు వైపే చూడడం మానేశారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్. రమణను పెట్టేసి కాడి వదిలేశాడు. ఏపీ రాజకీయాలకే పరిమితమైన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా తెలంగాణ రాజకీయాలను పట్టించుకోవడం లేదు. తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో విభధాలు భగ్గుమన్నారు. ప్రస్తుతం టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 21, 2020 6:43 pm
    Follow us on

    తెలంగాణలో దుకాణం సర్దేసి ఏపీకి వెళ్లి రాజకీయం వెళగబెడుతున్న చంద్రబాబుకు ఇది అనుకోని షాక్ లా మారింది. కేసీఆర్ ‘ఓటుకు నోటు’ దెబ్బకు తెలంగాణను వదిలిపోయిన చంద్రబాబు ఇటు వైపే చూడడం మానేశారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్. రమణను పెట్టేసి కాడి వదిలేశాడు. ఏపీ రాజకీయాలకే పరిమితమైన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా తెలంగాణ రాజకీయాలను పట్టించుకోవడం లేదు.

    తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో విభధాలు భగ్గుమన్నారు. ప్రస్తుతం టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలు తిరుగుబాటు లేవనెత్తారు. తెలంగాణ పార్టీ నాయకత్వ మార్పు కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా లేఖ రాశారు.

    Also Read : కాలుష్య కారకం.. ఉత్తర భారతంలో ఆరని ‘మంటలు’

    గత ఏడేళ్లుగా ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారని.. రాష్ట్రంలో పార్టీ ఉనికి ఆందోళనలో పడిందని.. ఇప్పటికైనా అధ్యక్షుడిని మార్చాలంటూ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో టీడీపీ పరిస్థితిని వివరిస్తూ కిందిస్తాయి కార్యకర్త నుంచి పార్లమెంట్ ఇన్ చార్జి వరకు కోర్ కమిటీ సభ్యులు సైతం తమ డిమాండ్లు తెలుపుతూ లేఖ రాశారు.

    ఏపీలో రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే అవకాశం ఉన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా రమణను మార్చాలని తాజాగా ఇక్కడి నేతలు గళం వినిపిస్తున్నారు. మరి దీనిపై చంద్రబాబు ఏం చేస్తాడన్నది వేచిచూడాలి.

    ఇప్పటికే ఏపీ టీడీపీ నేతలను కాపాడుకోవడానికే చంద్రబాబు తల ప్రాణం తోకకు వస్తోంది. అలాంటి సమయంలో పక్కనున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీలోనూ అసంతృప్తి జ్వాలలు చెలరేగడం చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందన్న భయం సీనియర్లను వెంటాడుతోంది.

    Also Read : ఆంధ్రాలో ఆధార్ లేని వాళ్లే తెలుగుదేశంలో ఉంటారంటున్న టీడీపీ ఎమ్మెల్యే..?