https://oktelugu.com/

టీటీడీపీ మార్పు ఖాయమా.. బాబు ఆలోచన ఏంటీ?

టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ ఎదుర్కొని గడ్డుపరిస్థితులను ప్రస్తుతం ఆ పార్టీ ఎదుర్కొంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలుసార్లు.. నూతనంగా ఏర్పడిన ఏపీలో ఒకసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. గత ఐదేళ్లపాటు ఏపీలో టీడీపీ అధికారంలో ఉండటంతో తెలంగాణలోని టీడీపీ నేతలకు కొంత ఊరట లభించింది. అయితే కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అటూ ఏపీలోనూ.. ఇటూ తెలంగాణలోనూ ఓటమి చెందడటంతో ఆ పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక […]

Written By:
  • NARESH
  • , Updated On : September 21, 2020 / 06:16 PM IST
    Follow us on

    టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ ఎదుర్కొని గడ్డుపరిస్థితులను ప్రస్తుతం ఆ పార్టీ ఎదుర్కొంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలుసార్లు.. నూతనంగా ఏర్పడిన ఏపీలో ఒకసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. గత ఐదేళ్లపాటు ఏపీలో టీడీపీ అధికారంలో ఉండటంతో తెలంగాణలోని టీడీపీ నేతలకు కొంత ఊరట లభించింది. అయితే కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అటూ ఏపీలోనూ.. ఇటూ తెలంగాణలోనూ ఓటమి చెందడటంతో ఆ పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది.

    ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీ నేతలను టార్గెట్ చేయడంతో ఆపార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. చంద్రబాబు హయాంలో మంత్రులుగా పనిచేసిన నేతల అవినీతి, అక్రమాలను బయటికి తీస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు అరెస్టు అవడంతో టీడీపీ నేతలంతా సైలంటయ్యారు. వైసీపీ అధికారంలో ఉండటంతో పలువురు టీడీపీ నేతలు ఇప్పటికే ఆపార్టీ కండువా కప్పుకోగా మరికొందరు టీడీపీలోనే ఉంటూ జగన్ కు వంతపడుతున్నారు.

    Also Read : తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు.. చంద్రబాబుకు షాక్

    ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ అధ్యక్షులను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు మార్చనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి టీటీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ కొనసాగుతున్నారు. అదేవిధంగా ఏపీలోనూ ఉత్తారంధ్రకు చెందిన కిమిడి కళా వెంకట్రావు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కూడా పని చేశారు. అయితే కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కళావెంకట్రావు ఓటమి చెందారు. అప్పటి నుంచే ఆయనను తప్పిస్తారనే ప్రచారం ఏపీలో జరుగుతోంది.

    ఇక తెలంగాణలోనూ టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఏడేళ్లుగా ఎల్.రమణ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో ఆయనను మార్చాలంటూ పలువురు నేతలు గతంలోనే చంద్రబాబు లేఖలు రాశారు. ఇటీవల కాలంలోనూ రమణపై సొంతపార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోనూ టీడీపీ అధ్యక్షుడిగా మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రకే చెందిన అచ్చె నాయుడిని నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడిని మారుస్తారనే టాక్ విన్పిస్తుంది.

    కరోనా పరిస్థితుల్లో బాబు పెద్దగా పర్యటనలు చేయకుండా హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల్లోని టీడీపీలోని సీనియర్లంతా ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఈనేపథ్యంలో చంద్రబాబు ఒకేసారి తెలుగు రాష్ట్రాల టీడీపీ అధ్యక్షులను మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కొత్తవారికి అవకాశం ఇస్తే పార్టీ తిరిగి గాడిన పడుతుందని బాబు ఆలోచిస్తున్నారట. దీనిపై త్వరలోనే చంద్రబాబు నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కొత్త అధ్యక్షుల నియామకంతోనైనా టీడీపీలో జోష్ వస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!

    Also Read : కాలుష్య కారకం.. ఉత్తర భారతంలో ఆరని ‘మంటలు’