UP Elections: దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు వచ్చే నెల 10 నుంచి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏడు విడతలుగా మార్చి 10 వరకు జరగుతాయి. ఈ నేపథ్యంలో యూపీలోని పొలిటికల్ పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. తాజాగా ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలు ప్రకటించారు. ఇందులో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ కనబడుతోంది.

దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన యూపీలో బీజేపీ గెలిస్తే కనుక వచ్చే సార్వత్రిక పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుందని ఈ సందర్భంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకం. కాగా, ఇవి సెమీ ఫైనల్ ఎలక్షన్స్ అని పలువురు అంటున్నారు కూడా.
ఏబీపీ ఒపీనియన్ పోల్ ప్రకారం యూపీలో బీజేపీ ఓటు షేర్ బాగా పెరిగింది. యోగి ఆదిత్య నాథ్ నేతృత్వంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్ స్పష్టం చేస్తోంది. ఈ సారి 41.5 శాతం ఓట్లు బీజేపీకి చేజిక్కనుందట. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) 33.3 శాతం, బీఎస్పీకి 12.9 శాతం, కాంగ్రెస్ 7.1 శాతం ఓటు షేర్ నమోదు చేయనున్నాయని అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రచార ప్రభావం ఉండబోదని అంచనా వేస్తున్నారు. ఇకపోతే కమలనాథులు సైతం తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నికలకు ముందర ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చామని, ఈ సందర్భంలో ప్రజలు మళ్లీ కాషాయానికే పట్టం కడతారని అంటున్నారు. మరోసారి యూపీ సీఎం అభ్యర్థిగా యోగి ఆదిత్యానాథ్‌నే ప్రొజెక్ట్ చేయాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. యూపీలోని మొత్తం 403 సీట్లలో 223-235 సీట్ల వరకు బీజేపీ దక్కించుకునే అవకాశం ఉంది.
Also Read: కేసీఆర్ విషయంలో బీజేపీ లెక్కలు వేరే లెవల్లో ఉన్నాయా?
యూపీలో జరిగే హోరాహోరీగా పోటీలో అఖిలేశ్ యాదవ్ ఎస్పీకి 145-157 వరకు సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ మరోసారి సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యే అవకాశాలున్నాయట. ఇక మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కూడా ఎన్నికల్లో ఆకట్టుకలోక పోవచ్చని ఒపీనియన్ పోల్స్ స్పష్ం చేస్తున్నాయి.
ఈ ఏబీపీ సర్వేలో సుమారు లక్ష మంది వరకు పాల్గొన్నారట. ఇకపోతే పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాలు అనగా గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకునే అవకాశాలున్నాయట. పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుందట. అక్కడ హంగ్ వచ్చే అవకాశాలూ ఉన్నాయని అంటున్నారు.