హత్రాస్‌ బాధిత కుటుంబాన్ని రక్షించడానికి యూపీ సర్కార్ సంచలనం

హత్రాస్‌ దళిత యువతిపై సామూహిక హత్యాచారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రతీ భారతీయుడు ముక్తకంఠంతో ఈ ఘటనను ఖండించారు. నిందితులను ఉరితీయాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, సాక్షులకు మూడంచెల రక్షణా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. దర్యాప్తుపై 15 రోజుల స్టేటస్ రిపోర్టులను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని సీబీఐని ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. Also Read: అప్పుడు వాజ్ పేయి.. ఇప్పుడు మోడీ.. పెట్రోల్ […]

Written By: NARESH, Updated On : October 15, 2020 1:06 pm
Follow us on

హత్రాస్‌ దళిత యువతిపై సామూహిక హత్యాచారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రతీ భారతీయుడు ముక్తకంఠంతో ఈ ఘటనను ఖండించారు. నిందితులను ఉరితీయాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, సాక్షులకు మూడంచెల రక్షణా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. దర్యాప్తుపై 15 రోజుల స్టేటస్ రిపోర్టులను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని సీబీఐని ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

Also Read: అప్పుడు వాజ్ పేయి.. ఇప్పుడు మోడీ.. పెట్రోల్ పై సంచలన నిర్ణయం?

హత్రాస్‌ ఘటనను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే సీబీఐ విచారణను కోరింది. ఈ విచారణను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా సుప్రీం కోర్టను విన్నవించింది. ఆ నివేదికను తగిన సమయంలో ప్రభుత్వానికి అందించేలా ఆదేశించాలని కోరింది. అంతేకాదు క్రమం తప్పకుండా ఉత్తరప్రదేశ్ డీజీపీ ఆ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తారని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసులో న్యాయ దర్యాప్తును నిర్వహించటానికి బాధితురాలి కుటుంబానికి, సాక్షులకు పూర్తి భద్రత కల్పించడానికి రాష్ట్రం కట్టుబడి ఉందని చెప్పింది.

బాధితురాలికి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు, ఒక బావ, అమ్మమ్మ ఉన్నారు. వీరు హత్రాస్‌ జిల్లాలోని చందపా గ్రామంలో నివసిస్తున్నారు. వారి భద్రత కోసం తగిన బలగాలను ఏర్పాటు చేశామని ఉన్నత కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తెలిపింది. బాధితురాలి కుటుంబ సభ్యులు, సాక్షులకు అందించిన రక్షణ మరియు భద్రత వివరాలను తెలియజేసింది. ఆమె ఇంటి సమీపంలో, వెలుపల 16 మంది వరకు సాయుధ పోలీసులు కాపలాగా ఉన్నారని, మూడంచెల భద్రత కల్పిస్తున్నామని చెప్పింది. ఎనిమిది సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

Also Read: ట్రంప్ vs జోబైడెన్.. ఎవరికి విరాళాలు ఎక్కువొచ్చాయంటే?

అక్టోబర్ 6న కోర్టు ఆదేశాలకు అనుగుణంగా యూపీ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. బాధిత యువతి కుటుంబ సభ్యులను, సాక్షులను రక్షించడానికి తీసుకున్న చర్యల గురించి తెలియజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. బాధితురాలి గ్రామ ఎంట్రెన్స్‌లో, ఆమె ఇంటి సమీపంలో, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు మరియు నలుగురు లేడీ కానిస్టేబుళ్లతో సహా మొత్తం 16 మంది పోలీసు సిబ్బంది ఉంటారని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు యోగి ప్రభుత్వం తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు సాక్షుల వ్యక్తిగత గోప్యత విషయంలో ఎటువంటి పరిస్థితిలోనూ జోక్యం చేసుకోబోమని, ఇక ఇదే విషయాన్ని అక్కడ విధులు నిర్వర్తించే పోలీసులకు కూడా చెప్పామని కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో తెలిపింది.