UP Election Result 2022: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ హవా కొనసాగుతోంది. విజయపథంలో దూసుకుపోతోంది. అధికారానికి కావాల్సిన సంఖ్యను దాటిపోయింది. 2024 ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో బీజేపీ అప్రతిహంగా విజయాన్ని నమోదు చేస్తోంది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తన ప్రభావం చూపెడుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ బీజేపీ యూపీలో అన్ని స్థానాల్లో బ్రహ్మాండమైన మెజార్టీ దిశగా వెళుతోంది. మరోమారు యోగి ఆదిత్యనాథ్ సీఎం కావడానికి అన్ని దారులు తెరుస్తోంది. దీంతో ఓటర్లు ఇచ్చిన తీర్పుపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం కావడంతో అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ పై పడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాలుగో స్థానానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 403 స్థానాలున్న యూపీలో బీజేపీ దాదాపు 260 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తోంది. ఈ నేపథ్యంలో అధికారానికి 202 సీట్లు అవసరం కాగా అంతకంటే ఎక్కువ సీట్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ తన అప్రతిహ విజయయాత్ర కొనసాగిస్తోంది. అయితే యూపీలో ఎంఐఎం పోటీ చేసి సమాజ్ వాదీ పార్టీ ఓట్లు చీల్చినట్లు ఆరోపణలు వచ్చిన సందర్భంలో బీజేపీ విజయం సాధించిందనే వాదనలు వస్తున్నా అందులో నిజం లేదని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.
తాము మతపరంగా ఓట్లు అడగలేదని చెబుతున్నారు. అభివృద్ధి మంత్రమే తమ విజయానికి కారణమైందని వారి అభిప్రాయం. దేశ రాజకీయాలకే కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం అందరు ఊహించిందే. మరోవైపు యూపీలో రైతుల నిరసన, లఖీంపూర్ ఘటన, అత్యాచారాలు వంటి అంశాలేవి బీజేపీ దూకుడును ఆపలేకపోయాయి. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోసారి యోగి ఆదిత్యనాథ్ సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

అనూహ్యంగా బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన యోగి ఆదిత్యనాథ్ కు మరోమారు సీఎం పీఠం దక్కనుంది. ఎందరు వ్యతిరేకించినా ఎన్ని ఆరోపణలు చేసినా బీజేపీకి మాత్రం తిరుగులేని విజయాన్ని దక్కించుకుని ప్రతిపక్షాలకు సవాలు విసురుతోంది. అధికారమే ధ్యేయంగా బీజేపీ సాధించిన విజయంపై అందరిలో హర్షం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి బాగా పనిచేసిందని తెలుస్తోంది. ఎస్పీకి విజయావకాశాలు ఉన్నా అది సక్సెస్ కాలేకపోయింది. దీంతో బీజేపీ విజయం ఖాయమైందని సమాచారం.
యూపీలో బీజేపీకి వ్యతిరేకత ఉందని ప్రచారం సాగినా అది నిజం కాదని తేలిపోయింది. బీజేపీ విజయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫలితాలు పార్టీకి అనుకూలంగా రావడంతో కార్యకర్తల్లో కూడా హర్షం వ్యక్తమవుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా దాదాపు 12 వేల మెజార్టీతో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బీజేపీ విజయంతో మరో మెట్టు ఎక్కిందని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో మరోమారు దేశంలో విజయం సాధించడం ఖాయమని జోస్యం చెబుతున్నారు.
[…] […]