https://oktelugu.com/

Pooja Hegde: రాధేశ్యామ్ థియేటర్లో పూజా హెగ్డే చేసిన ఈ చిలిపి పని.. వైరల్ వీడియో

Pooja Hegde:  రాధేశ్యామ్ మూవీ మేనియా మొదలైంది. ఈ మూవీ ప్యాన్ ఇండియా మూవీగా దేశంలో హిందీతోపాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సహా విదేశాల్లోనూ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ మేనియా ఇప్పటికే అభిమానులను ఊపేస్తోంది. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ మూవీ ప్రీమియర్స్ పడిపోయాయి. హిందీ, తెలుగు సహా పలు భాషల్లో బెనిఫిట్ షోలను సెలబ్రెటీలు చూసేశారు. ఈ క్రమంలోనే ‘రాధేశ్యామ్’లో హీరోయిన్ గా చేసిన పూజా హెగ్డే సైతం థియేటర్ లో హిందీ వెర్షన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 10, 2022 / 02:33 PM IST

    Radhe Shyam Heroine Pooja Hegde

    Follow us on

    Pooja Hegde:  రాధేశ్యామ్ మూవీ మేనియా మొదలైంది. ఈ మూవీ ప్యాన్ ఇండియా మూవీగా దేశంలో హిందీతోపాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సహా విదేశాల్లోనూ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ మేనియా ఇప్పటికే అభిమానులను ఊపేస్తోంది.

    Pooja Hegde

    ఇప్పటికే ‘రాధేశ్యామ్’ మూవీ ప్రీమియర్స్ పడిపోయాయి. హిందీ, తెలుగు సహా పలు భాషల్లో బెనిఫిట్ షోలను సెలబ్రెటీలు చూసేశారు. ఈ క్రమంలోనే ‘రాధేశ్యామ్’లో హీరోయిన్ గా చేసిన పూజా హెగ్డే సైతం థియేటర్ లో హిందీ వెర్షన్ మూవీ చూసింది. ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేసింది.

    Also Read:  రివ్యూ : ‘ఇ.టి’

    తన స్నేహితులతో కలిసి ‘రాధేశ్యామ్’ మూవీని చూసి పూజా హెగ్గే.. ‘మరో ఒక్కరోజులో రాధేశ్యామ్ మీ ముందుకు వస్తుందని.. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అంటూ విక్టరీ సింబల్ ను చూపించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ‘రాధేశ్యామ్’ రూపొందింది. ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకుడు . చేతి గీతల ఆధారంగా జాతకాలు చెప్పే విక్రమాదిత్యగా ప్రభాస్ నటించాడు. హీరోయిన్ పూజా మనసు గెలుచుకున్నాడా? లేదా? అన్నది సినిమా కథ. మరి ఈ చిత్రం ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నది వేచిచూడాలి.

    Pooja Hegde

    రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి మొదలైంది. థియేటర్లలో డార్లింగ్ ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు. ప్రభాస్ భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు.

    Also Read:  ఏంటి.. ఈమె హీరోయిన్ షామిలినా.. ఇలా మారిపోయిందేంటి..

    Tags