UP CM Adityanath Yogi: ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒమిక్రాన్ జపం చేస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడు మన దేశంలో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అయితే ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు దీని పట్ల అలెర్ట్ అయిపోయాయి. చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు కూడా విధిస్తున్నారు. ఒకానొక దశలో అయితే దేశంలో మళ్లీ లాక్ డౌన్ తప్పదా అన్నట్టు వార్తలు కూడా హల్ చల్ అవుతున్నాయి. అయితే ఇంతలా హాట్ టాపిక్ అవుతున్న ఒమిక్రాన్ మీద యూపీ సీఎం చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి.

ఆయన చేసిన కామెంట్లు చూస్తుంటే గతంలో కేసీఆర్, జగన్ మాదిరిగానే అనిపిస్తున్నాయి. వారు కరోనా మొదటి వేవ్ కంటే ముందు కరోనా మీద ఇలాగే మాట్లాడారు. ప్యారాసిటమాల్ వేస్తే సరిపోతుందని, దానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదంటూ మాట్లాడార. కానీ ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరం చూశాం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కూడా ఒమిక్రాన్ సాధారణమైనదే అని దాని వల్ల వైరల్ ఫీవర్ వస్తుంది అని అంతకు మించి ఇంకేం కాదన్నారు.
Also Read: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై అందరిలో ఉత్కంఠ?
ప్రస్తుతం దేశంలో ఉన్న డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ప్రమాదకరమైంది ఏమీ కాదని ఆయన వెల్లడించారు. కానీ దాని పట్ల జాగ్రత్త అవసరం అంటూ మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాటలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. అయితే యూపీలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ కూడా అమలులో ఉంది. కాగా యూపీలో ఇప్పటి వరకు 8 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పుడు ఆయన మాటలు మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఎందుకంటే గతంలో కేసీఆర్, జగన్ కొవిడ్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసి పరువు పోగొట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు ప్రతిపక్షాలు కూడా ప్రెస్ మీట్ పెట్టి వారు చేసిన కామెంట్ల మీద తీవ్ర విమర్శలు చేశారు. అటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అయితే రేపు ఒమిక్రాన్ ప్రభావం యూపీలో పెరిగితే యోగి ఆదిత్యనాథ్ మీద కూడా ఇలాంటి విమర్శలు తప్పకపోవచ్చని నిపుణులు అంటున్నారు.
Also Read: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లో దీప్తి కన్నీళ్లు.. వైరల్