UP Assembly Elections: దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ సత్తా చాటేందుకు రాజకీయ పార్టీలు ప్రణాళికలు రచించుకుంటున్నారు. అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించి తాము రాజకీయ అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు పక్కాగా ప్లాన్ చేస్తున్నాయి. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ తామే మళ్లీ అధికారంలోకి రావాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ తమదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ, ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వలోని కాంగ్రెస్ పార్టీ ఏకమై పోరాడుతున్నాయి. ఈసారి ఎలాగైనా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్లాన్ చేస్తున్నారు ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇందుకుగాను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని డిసైడ్ అయ్యారు. అయితే, ఇప్పటికే వచ్చిన సర్వేల ప్రకారం, ఒపీనియన్ పోల్స్ ప్రకారం.. యూపీ మళ్లీ బీజేపీదేనని తేలింది.
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో కమలం పార్టీ మరోసారి ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి రాబోతున్నదని స్పష్టమవుతున్నది. ఒపినీయన్ పోల్స్ ప్రకారం.. యూపీలోని 403 అసెంబ్లీ స్థానాల్లో 212 నుంచి 224 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోబోతున్నదని చెప్తన్నారు. ఎస్పీకి 151 నుంచి 163 స్థానాలు వచ్చే చాన్సెస్ ఉంటాయంటున్నారు. ఇక మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ గతంలో కంటే ఈసారి పుంజుకుంటుందని పేర్కొంటున్నారు. బీఎస్పీకి 12 నుంచి 24 స్థానాలు వచ్చే చాన్సెస్ ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 10 సీట్లు రావొచ్చని అంటున్నారు.
Also Read: అమెరికాపై విరుచుకుపడిన టర్నోడోలు.. బీభత్సం..!
బీజేపీకి మాత్రం గతంతో పోల్చితే ఇంకా ఎక్కువ సీట్లు రావచ్చని అంటున్నారు. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల మనసుల్లో ఉన్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. 2017లో ప్రచారం సందర్భంగా ఇచ్చిన లోక కల్యాణ పత్ర హామీలన్నిటినీ నెరవేర్చినట్లు సీఎం యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. రైతులు, ప్రజల సంక్షేమమే ప్రయారిటీగా తమ ప్రభుత్వం పని చేసిందని, భవిష్యత్తులోనూ చేస్తుందని యోగి తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సహకారంతో రాష్ట్రంలో పనులు జరిగాయని అన్నారు. దేశ అభివృద్ధిలో యూపీ పాత్ర కీలకమని తెలిపారు.
Also Read: పవన్ పాలిటిక్స్ షురూ.. విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా దీక్ష..