Mahesh and Prabhas: టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్.. ఎవరికి వారు సెపరేట్ స్టైల్‌ను కలిగి ఉన్నారు. ఇద్దరికీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. వీరిద్దరూ ఓ విషయంలో ఒకే బాటలో నడిచారు. ఎందులోనంటే… తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ప్రాపర్టీస్ కొనుగోలు చేశారు ఇద్దరు స్టార్స్. ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయన నటించే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా వైడ్ సినిమాలే. దాంతో ఆయన తన మకాం ఇటీవల ముంబైకి షిఫ్ట్ చేశారు. అక్కడ చిన్న ఫామ్ హౌజ్ కూడా కన్ స్ట్రక్ట్ చేసుకున్నట్లు టాక్.

అయితే, తనకు షూటింగ్స్ నిమిత్తం ముంబై వెళ్లే క్రమంలో హైదరాబాద్‌లోనూ మంచి హౌజ్ ఉండటంతో పాటు అది ట్రావెలింగ్‌కు అనుకూలంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఎయిర్ పోర్ట్‌కు దగ్గర్లో ఉండాలనుకున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీలోని నానక్ రామ్ గూడ ఓఆర్ఆర్ కు దగ్గరలో రూ.120 కోట్లతో రెండెకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఆయన కొనుగోలు చేసిన ప్లేస్ ట్రాఫిక్ ఫ్రీ ఏరియా అవడంతో పాటు ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉంటుందని హ్యాపీగా ఫీలయ్యారట ప్రభాస్. ఆ రెండెకరాల ప్లేస్‌లో ప్రభాస్ విలాసవంతమైన గెస్ట్ హౌస్ లేదా బంగ్లాను నిర్మించాలనుకుంటున్నాడని టాక్. ఇక ఈ ఏరియా నుంచి ప్రభాస్ ఎటు వైపునకు వెళ్లాలన్నా.. అనగా ఎయిర్ పోర్ట్, రామోజీ ఫిల్మ్ సిటీ, ఇతర ప్రదేశాలకు షూటింగ్ నిమిత్తం వెళ్లడానికి ఈజీగా ఉంటుందని అనుకుంటున్నారట.
Also Read: ప్రభాస్ హీరోయిన్ కి వేరే సంపాదన ఉందట !
సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా హైదరాబాద్‌లో న్యూ ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
రూ.26 కోట్ల విలువైన ప్లాట్ ఒకదానిని ఖరీదైన జూబ్లీహిల్స్ ఏరియాలో కొనుగోలు చేసినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. ఇందుకు సంబంధించిన డబ్బులు కూడా మహేశ్ ఇప్పటికే సగం కంటే ఎక్కువ పే చేశారని వినికిడి. ఇక ఈ హీరోల సినిమాల విషయానికొస్తే.. మహేశ్ బాబు -‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ కాంబోలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించగా, మహేశ్ బాబు సరసన హీరోయిన్‌గా బ్యూటిఫుల్ కీర్తి సురేశ్ నటించింది. ఇక ప్రభాస్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘రాధే శ్యామ్’ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.
Also Read: ఆ హీరో చెప్పిన మాటలు నాపై మాములు ప్రభావం చూపలేదు- ప్రియాంక జవాల్కర్