Unstoppable With NBK Season 2- Allu Aravind: యువరత్న బాలక్రిష్ణ, అల్లు అరవింద్ కాంబినేషన్ అసలు ఊహించలేనిది. ఒకరు నందమూరి, మరోకరు మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన వారు. తండ్రులు పరంగా రెండు కుటుంబాలకు సన్నిహిత సంబంధాలున్నా.,. తరువాత వచ్చిన జనరేషన్లతో రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఉందన్నది ప్రచారం. అయితే అదంతా గ్యాసిప్స్ అని.. తామంతా ఒకటేనని బాలక్రిష్ణ చాలా సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా అల్లు అరవింద్ సారధ్యంలో ఆహా ఓటీటీ ప్లాట్ ఫారమ్ లో బాలక్రిష్ణ హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రెండో సీజన్ కూడా ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేష్ తో రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ఈ నెల 14న టెలికాస్టవుతోంది. ఇప్పటికే ప్రోమో అంచనాలకు మించి ఉంది. బొమ్మ దద్దరిల్లింది.

అయితే అన్ స్టాపబుల్ రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ గురించి అంతా ఎదురుచూస్తున్నారు. కానీ తెలుగు తమ్ముళ్లు మాత్రం తెగ ఆందోళన పడుతున్నారు. టీడీపీకి మాయని మచ్చగా ఉన్న 1995 ఎపిసోడ్ ను గుర్తుకు తేవడమే ఇందుకు కారణం. ప్రస్తుత జనరేషన్ కు చంద్రబాబు ఒక డైనమిక్ లీడర్. దూరదృష్టి కలిగిన నాయకుడు. విజనరీ ఉన్న వ్యక్తి. అయితే అన్ స్టాపబుల్ కార్యక్రమంలో నాడు ఎన్టీఆర్ ను పదవివిచ్యుతుడుచేయడం, నందమూరి కుటుంబసభ్యులు చంద్రబాబుకే సపోర్టు చేయడం వంటి పరిణామాలు ఇప్పటికీ మాయని మచ్చే. కానీ ఇప్సటి జనరేషన్ కి అవి తెలియవు. ఈ కార్యక్రమం ద్వారా తెలిసే అవకాశముండడంతో వారి నుంచి రియాక్టు ఎలా ఉంటుందోనని తెలుగుదేశం శ్రేణులు భయపడుతున్నాయి.

మరోవైపు నారా లోకేష్ పొలిటికల్ ఎంట్రీపై కూడా హోస్టుగా ఉన్నబాలక్రిష్ణ కొన్ని అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు ఆరోపించే స్విమ్మింగ్ ఫుల్ వద్ద భామలతో ఎంజాయ్ చేసే ఫొటోను చూపించారు. దీంతో ఇది విపక్షాలకు అస్త్రమిచ్చినట్టువుతుందని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. అయితే అనవసరంగా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తన లాభం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చిన అల్లు అరవింద్ పై తమ్ముళ్లు అనుమానపు చూపులు చూస్తున్నారు. రాజకీయంగా దెబ్బ కొట్టడానికేనని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రోమోకే అనుమానాలు పెంచుకోవద్దని…. ఎన్నో ఏళ్లుగా సశేషంగా నిలిచిన ప్రశ్నలకు నివృత్తి చేసేందుకేనని అల్లు అరవింద్ తో పాటు ఆహా అన్ స్టాపబుల్ టీమ్ చెబుతోంది. కచ్చితంగా ఇది చంద్రబాబు, లోకేష్, బాలక్రిష్ణలకు మైలేజ్ అవుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
+