Geethanjali Movie Girija Shettar: ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది గిరిజా షెట్టర్. 1989లో విడుదలైన గీతాంజలి ఆల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా ఇప్పటికీ ప్రేక్షకులు కొనియాడుతారు. మణిరత్నం మాస్టర్ మైండ్ నుండి పుట్టిన గొప్ప చిత్రాల్లో గీతాంజలి ఒకటి. హీరో నాగార్జునకు సైతం మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. గీతాంజలి మూవీలో గిరిజ చనిపోతానని తెలిసి కూడా లైఫ్ చక్కగా ఎంజాయ్ చేసే అల్లరి పిల్ల క్యారెక్టర్ చేశారు. గిరిజ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. కుర్రకారు ఆమె మాయలో పడిపోయారు.

గీతాంజలి సక్సెస్ నేపథ్యంలో గిరిజ స్టార్ గా ఇండస్ట్రీని ఏలడం ఖాయం అనుకున్నారు. అలా జరగలేదు. నాలుగైదు చిత్రాలకే ఆమె జర్నీ ముగిసింది. గీతాంజలి తర్వాత మలయాళంలో వందనం అనే మూవీ చేశారు.అది కూడా సూపర్ హిట్. ప్రియదర్శన్ డైరెక్షన్ లో మోహన్ లాల్ హీరోగా వందనం తెరకెక్కింది. సేమ్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ మరో చిత్రం ప్రారంభమైంది. ఆ మూవీ అనుకోని కారణాలతో ఆగిపోయింది.
అయితే గిరిజ ఇండస్ట్రీకి దూరం కావడానికి అమీర్ ఖాన్ మూవీ అని తెలుస్తుంది. ఫార్మ్ లో ఉన్న గిరిజకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. జో జీతా ఓహి సికిందర్ మూవీ హీరోయిన్ గా గిరిజ ఎంపికయ్యారు. సినిమా ఒప్పందం చేసుకునేటప్పుడు ఎలాంటి స్కిన్ షో అవసరం లేదు, అసభ్యకర సన్నివేశాలు ఉండవని చెప్పి, సెట్స్ లోకి వెళ్ళాక ఎక్స్ ఫోజ్ చేయాలని ఇబ్బంది పెట్టారట. ఆమె ఒప్పుకోకపోగా చిత్ర యూనిట్ పై న్యాయపోరాటం చేసింది. దీంతో ఆమెను చిత్రం నుండి తొలగించారు. ఆమెపై తెరకెక్కిన ఓ సాంగ్ ని ఐటెం నంబర్ గా మార్చేశారు.

అసలు గిరిజ నటి కావాలని అనుకోలేదు. ఓ ఫంక్షన్ లో మణిరత్నం కంటికి చిక్కింది. సబ్జెక్టు చెప్పి ఆఫర్ ఇచ్చాడు. అలా ఆమె నటి అయ్యారు. కన్నడ తండ్రి బ్రిటిష్ మదర్ కి పుట్టిన గిరిజ సినిమాలకు దూరం అయ్యాక జర్నలిస్ట్ గా పని చేశారు. ఫిలాసఫీ మీద ఆర్టికల్స్ ప్రచురించారు. గిరిజ చివరి చిత్రం తుజే మేరీ కసమ్. జెనిలియా, రితేష్ దేశ్ ముఖ్ నటించిన ఈ మూవీలో ఆమె గెస్ట్ రోల్ చేశారు. 53 ఏళ్ల గిరిజ పెళ్ళికి దూరంగా ఉండిపోయారు. ఆమెకు వివాహం అంటే అసలు ఆసక్తి లేదట. జీవితంలో పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా చెప్పేశారు. సినిమాలు మానేశాక ఆమె తిరిగి లండన్ వెళ్లిపోయారు.