Tovino Thomas- Krithi Shetty: తెలుగు సినిమాకు పరిచయమైన కృతి శెట్టి ఉప్పెన సినిమా ద్వారా పరిచయం అయింది. మొదటి సినిమాతోనే అఖండమైన విజయం అందుకున్న ఈ కన్నడ భామ తరువాత అన్ని పరాజయాలే మూటగట్టుకుంది. ఒక దశలో ఐరన్ లెగ్ గా ముద్రపడింది. దీంతో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. మొదటి సినిమా ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. వరుసగా వస్తున్న అవకాశాలతో ఆమె నిలదొక్కుకోవాలని ప్రయత్నించినా ఆ సినిమాలన్ని అపజయాలే చవిచూశాయి.

ఉప్పెన తరువాత ఆమె చేసిన సినిమాలన్ని ప్లాపులయ్యాయి. ఇది ఆమెకు శాపంగా మారింది. ఆమె నటించిన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో కోలుకోలేకపోతోంది. రామ్ ది వారియర్, నితిన్ తో మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు చేసినా అవి ఆకట్టుకోలేదు. దీంతో కృతిశెట్టికి నిరాశే మిగిలింది. వరుస పరాజయాలు పలకరించడంతో ఇక ఆమె భవిష్యత్ మీద పెను ప్రభావం పడుతోంది. ఆమెకు ఏ హీరో కూడా అవకాశాలు ఇవ్వడం లేదు. దీంతో ఆమె ప్రస్థానం ప్రశ్నార్థకంలో పడింది.
టాలీవుడ్ లో దాదాపు అవకాశాలు సన్నగిల్లాయి. ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. స్టార్ హీరోలు ఆమెను తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. కృతి శెట్టికి కొత్త సినిమాల్లోకి అవకాశాలు రావడం లేదు. నటనపరంగా తన పాత్రకు సముచిత ప్రాధాన్యముండే పాత్రలు రావడం లేదు. దీంతో ఆమె తన మాతృభాష అయిన కన్నడంలో తన అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తోంది. తమిళంలో కూడా వారియర్ తో పరిచయమైనా అక్కడ కూడా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో ఆమె కేరళలో కూడా తన సత్తా చూపించాలని చూస్తున్నా అది నెరవేరుతుందో లేదో చూడాల్సిందే.

కేరళ స్టార్ హీరో టొవినో థామస్ హీరోగా నటిస్తోన్న ఓ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక్కడ మైనస్ లను మూటగట్టుకున్న కృతికి కేరళనైనా స్వాగతం పలుకుతుందా లేక పరాజయాలే పలకరిస్తాయా తెలియడం లేదు. మొత్తానికి కృతి శెట్టికి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. అన్ని భాషల్లో ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ప్రస్థానం మరింత మెరుగు కావాలంటే ఆమెకు విజయాలు కావాలి. విక్టరీలు వస్తేనే వరుస ఆఫర్లు క్యూ కడతాయి. ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటుందని చెబుతున్నారు. సో కృతిశెట్టి ఆల్ ది బెస్ట్. రాబోయే కాలంలో మరిన్ని మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థానం సంపాదించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.