Unlimited Calls
Unlimited Calls : మీరు కూడా ఇంటర్నెట్ గురించి చింతిస్తున్నారా? అయితే BSNL కు సంబంధిచిన ఈ ప్లాన్ మీకు మంచి ఇంటర్నెట్ ప్యాక్‌ను అందిస్తుంది. BSNL ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్‌లో, మీరు అపరిమిత కాలింగ్ (భారతదేశంలో), ఉచిత SMS OTT సబ్‌స్క్రిప్షన్, 1000 GB కంటే ఎక్కువ డేటాను పొందుతారు. మరి ఇంత అపరిమిత ప్రయోజనాలను అందిస్తున్న BSNL రీఛార్జ్ ప్లాన్‌ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే Jio, Airtel, Vodafone, BSNL టెలికాం కంపెనీలలో కస్టమర్లను నిలుపుకోవడానికి రేసులో ఉన్నాయి. ఈ పోటీ కారణంగా, కంపెనీలు తమ వినియోగదారులకు విభిన్న రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.
BSNL ప్లాన్‌లో 8 OTT ప్లాట్‌ఫారమ్‌లు: డేటా, కాలింగ్‌తో వచ్చే ఈ BSNLలో, మీరు 8 OTT ప్లాట్‌ఫారమ్‌ల సభ్యత్వాన్ని పొందవచ్చు. వీటిలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం, సోనీలైవ్, వూట్ ఉన్నాయి. రూ. 999 రీచార్జ్ చేసుకుంటే మీరు హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాలింగ్, ఉచిత OTT సభ్యత్వాన్ని పొందవచ్చు.
రూ. 399 ప్లాన్
మీరు 399 రూపాయల BSNL ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఒక నెల చెల్లుబాటుతో అందుబాటులో ఉంటుంది. 30Mbps వేగంతో ప్లాన్‌లో 1000GB డేటా లభిస్తుంది. డేటాతో పాటు, మీరు స్థిర కనెక్షన్‌తో దేశవ్యాప్తంగా ఉచిత కాలింగ్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు.
BSNL సూపర్‌స్టార్ ప్రీమియం ప్లస్ ప్రత్యేకత:
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో, 150Mbps అధిక వేగంతో 2,000GB డేటాను అందిస్తోంది. ఇందులో మీరు ప్రతిరోజూ 60GB కంటే ఎక్కువ డేటాను ఉపయోగించవచ్చు. దీనిలో, మీరు ఫిక్స్డ్ కనెక్షన్ నుంచి దేశవ్యాప్తంగా ఉచిత కాలింగ్ చేయవచ్చు. మీకు BSNL నంబర్ లేదా అయితే ఇలా మీ నెంబర్ ను మార్చుకోండి.
BSNLలో SIM పోర్ట్ ఎలా పొందాలి
మీకు ఏదైనా ఇతర కంపెనీ నంబర్ ఉంటే, దానిని BSNL కు మార్చాలి అనుకుంటే పెద్ద కష్టం కాదు. దీని కోసం మీరు మీ అందుబాటులో ఉన్న నంబర్ తర్వాత ‘PORT’ అని టైప్ 1900కి SMS పంపాలి. మీరు యూనిక్ పోర్టింగ్ కోడ్ (UPC)ని అందుకుంటారు. దీని తర్వాత BSNL కస్టమర్ కేర్ సెంటర్ (CSC) లేదా ఏదైనా అధికారిక సెంటర్ కు వెళ్లండి.
ఇక్కడ మీరు కస్టమర్ అప్లికేషన్ ఫారమ్ (CAF) నింపాలి. పోర్టింగ్ రుసుమును జమ చేస్తే మీకు BSNL SIM కార్డ్ ఇస్తారు. మీ నెంబర్ తోనే సిమ్ యాక్టివ్ అవుతుంది. ఆ తర్వాత ఓ ప్రత్యేక నంబర్ పంపిస్తారు. దీని ద్వారా మీరు మీ నంబర్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చ.