Union Minister Nirmala Sitharaman: అంతర్జాతీయంగా ప్రధాని మోదీ తిరుగులేని నేత. ఇది ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా ఆయన ఎదిగారు. చాలా సందర్భాల్లో గుర్తింపు సాధించారు. సాహోసోపేత నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. అటువంటి ప్రధాని మోదీని దేశంలోని కొన్ని రాష్ట్రాల పాలకులు గుర్తించకపోవడం అటు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పాలకులకు మింగుడుపడని అంశం. రాజకీయంగా విభేదించే చాలా రాష్ట్రాలు ప్రధానిని లెక్క చేయకపోవడంపై కేంద్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఇటువంటి పరిస్థితే కేంద్రానికి ఎదురయ్యింది. తెలంగాణలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. రేషన్ డిపోల్లో ప్రధాని ఫొటో లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కూడా కొద్ది నెలల కిందట పర్యటించిన ఆమెకు ఇటువంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఆమె కలెక్టర్లతో పాటు ఇతర అధికారులపై రుసరుసలాడారు. తక్షణం ప్రధాని మోదీ ఫొటోను ఏర్పాటుచేయాలని ఆదేశాలివ్వాల్సివచ్చంది.

బీజేపీయేతర ప్రభుత్వాలున్న చోట..
కొవిడ్ అనంతరం దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న రేషన్ లబ్ధిదారుకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అటు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కోటా కింద ఉచితంగా రేషన్: బియ్యం అందిస్తూ వస్తోంది. గత రెండేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బంది లేకున్నా..బీజేపీయేతర పార్టీలు అధికారమున్న చోట మాత్రం కేంద్రం అందించే ఉచిత బియ్యం పంపిణీ సమయంలో మాత్రం విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడా కేంద్రం ముద్ర లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్త పడుతూ వస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వానికి రుచించడం లేదు. తాజాగా తెలంగాణ పర్యటనలో భాగంగా బాన్సువాడ జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ డిపోలను సందర్శించారు. కానీ అక్కడ సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రుల ఫొటోలే దర్శనమిచ్చాయి. దీంతో కోపంతో ఊగిపోయిన కేంద్ర మంత్రి అక్కడే ఉన్న కలెక్టర్ ను పిలిచారు. ఏంటీ ఈ పరిస్థితి అని ప్రశ్నించారు. కేంద్రం ఉచితంగా రేషన్ అందిస్తుంటే కనీసం ప్రధాని మోదీ ఫొటోను ఏర్పాటుచేయకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఫొటోలను ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని గట్టిగానే చెప్పారు.
Also Read: Pawan Kalyan Birthday Special: ‘పవర్’ మార్చే పవన్ స్టార్.. జన సేనాని రాజకీయ లక్ష్యం అదే!

నిరసన సెగలు..
మరోవైపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ పర్యటనలో అడుగడుగునా నిరసన సెగలు తగులుతునే ఉన్నాయి. బాన్సువాడ పర్యటనకు వచ్చిన ఆమెను యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెంచిన పెట్రోల్ , డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కాన్వాయన్ ను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. మొత్తానికి వరుసగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న నిర్మలాసీతారామన్ కు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు రుచించలేదు. రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ నిధులు కేటాయిస్తున్నా క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడాన్ని ఆమె గుర్తించారు. ఢిల్లీ వెళ్లి స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని ఆమె భావిస్తున్నారుట. కేంద్రం సదుద్దేశ్యంతో అందిస్తున్న ఉచిత రేషన్ ను తమ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవడంపై ఓకింత ఆగ్రహంతో ఉన్నారు. ఫొటో రాజకీయాలను చెక్ చెప్పేందుకు ఆమె నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Also Read:Gautam Adani: అప్పులు చేసి ఆస్తులు పెంచుకుంటున్న అదాని.. ప్రపంచంలో మూడో సంపన్నుడిగా గుర్తింపు !!
[…] […]