
Petrol And Diesel- GST: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రం కొత్త ఎత్తుగడ వేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో రాష్ట్రాలు ఒప్పుకోవాలని మెలిక పెడుతోంది. రాష్ట్రాలు ఒప్పుకోవు. కేంద్రమూ ఒప్పించదు. ఎందుకంటే రెండింటికీ ప్రధాన ఆదాయ వనరు పెట్రోల్, డీజిలే. అలాంటప్పుడు జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తెస్తారు. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. సామాన్యుడికి ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read: Kanna Lakshminarayana: నాపై హత్యాప్రయత్నం చేయించాడు అని ఇప్పుడు అతని పార్టీలో చేరుతున్న కన్నా
రాష్ట్రాలు ఒప్పుకుంటే పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ధరలు నిత్యం పెరుగుతుండటంతో జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ వస్తున్నట్టు ఆమె అన్నారు. జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం సానుకూలంగా ఉన్నప్పటికీ.. జీఎస్టీ కౌన్సిల్ లో ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. కేంద్ర మంత్రి మాటలు చూస్తే .. ఎన్నికల ముందు ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇన్నేళ్లు పెట్రోల్, డీజిల్ పై ఎడాపెడా పన్నులు వాయించి.. ఎన్నికల ముందు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి తాము అనుకూలంగా ఉన్నామని చెప్పడం ఎంత హాస్యాస్పదం. రాష్ట్రాలు ఒప్పుకుంటే అంటూ మరో మెలిక పెట్టడం ఎంత విడ్డూరం. నిర్మలాసీతారామన్ మాటలు పరిశీలిస్తే.. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ససేమిరా ఇష్టం లేనట్టు కనిపిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ విషయంలో ఎత్తుగడ వేస్తున్నట్టు అర్థమవుతోంది. పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. ఎన్నికల ముందు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది. పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామంటే రాష్ట్రాలు ఒప్పుకోవు. ఈ విషయం కేంద్రానికి తెలుసు. కేంద్రానికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ నుంచే ఖజానాకు భారీ ఆదాయం వస్తుంది. పెట్రోల్, డీజిల్ నుంచి వచ్చే ఆదాయాన్ని కేంద్రం వదులుకోలేదు.

అటు పెట్రోల్, డీజిల్ ఆదాయాన్ని వదులుకోకూడదు. ఇటు ప్రజల్లోనూ మంచి పేరు రావాలి. ఇది ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడ. కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడ విజయవంతం కావడానికి రాష్ట్రాలను పావుగా వాడుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రాలు ఒప్పుకోవని మెలిక పెడుతోంది. రాష్ట్రాలను సాకుగా చూపి పెట్రోల్ , డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురారు. అదే సమయంలో తాము అనుకూలమని ప్రజలకు చెబుతారు. ఇది ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ఎత్తుగడగా అర్థమవుతోంది. నిజంగా పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే.. లీటర్ పెట్రోల్ రూ. 56 కి, డీజిల్ రూ.55కి సామాన్యులకు దక్కే అవకాశం ఉంటుంది. సగం ఆదాయాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కూడా లేదు.
Also Read:Sajjala Bhargav: వైసీపీ సోషల్ మీడియాలో చిచ్చు.. తండ్రి ఫార్ములాను అనుసరిస్తున్న సజ్జల భార్గవ్