దుబ్బాకలో హరీష్ రావు రెండుకళ్ల సిద్ధాంతం.. ఫలిస్తుందా?

రెండుకళ్ల సిద్ధాంతం మొదట కనిపెట్టింది మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు ఈ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఈ వ్యూహం తొలినాళ్లలో కొంతమేర టీడీపీని కాపాడింది. అయితే ఇదే వ్యూహం చివరికీ తెలంగాణలో ఆ పార్టీ కనుమరుగయ్యేలా చేసింది. రెండుకళ్ల సిద్ధాంతం కొంచెం అటూ ఇటూ అయితే మాత్రం అసలుకే మోసం రావడం ఖాయం. అలాంటి వ్యూహాన్ని హరీష్ రావు ఫాలో అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. Also Read: తెలంగాణలోని మినీ […]

Written By: NARESH, Updated On : October 9, 2020 10:09 am
Follow us on

రెండుకళ్ల సిద్ధాంతం మొదట కనిపెట్టింది మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు ఈ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఈ వ్యూహం తొలినాళ్లలో కొంతమేర టీడీపీని కాపాడింది. అయితే ఇదే వ్యూహం చివరికీ తెలంగాణలో ఆ పార్టీ కనుమరుగయ్యేలా చేసింది. రెండుకళ్ల సిద్ధాంతం కొంచెం అటూ ఇటూ అయితే మాత్రం అసలుకే మోసం రావడం ఖాయం. అలాంటి వ్యూహాన్ని హరీష్ రావు ఫాలో అవుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Also Read: తెలంగాణలోని మినీ ఇండియా గ్రామం గురించి మీకు తెలుసా..?

తెలంగాణలోని దుబ్బాకలో త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నిక మంత్రి హరీష్ రావుకు కత్తి మీద సాములా మారింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా హరీష్ రావుకు ఎన్నికల బాధ్యతలను అప్పగిస్తే అతడు ఆ సీటును గెలిపించి తీరుతాడని కేసీఆర్ కు నమ్మకం. దీంతోనే దుబ్బాక నియోజకవర్గ బాధ్యతను కేసీఆర్ తన మేనల్లుడైన హరీష్ రావుకు అప్పగించాడు. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట పక్కనే దుబ్బాక నియోజకవర్గం ఉంది. దీంతో ఆయనకు ఈ ప్రాంతంలోని వారితో సన్నిహిత సంబంధాలున్నాయి.

అయితే దుబ్బాకలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉంది. తొలి నుంచి టీఆర్ఎస్ కు కంచుకోటగా దుబ్బాక నియోజకవర్గం ఉన్నా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రామలింగారెడ్డి కుటుంబంపై కూడా కొన్ని గ్రామాల్లో పూర్తి వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు రామలింగారెడ్డి భార్య సుజాతకు రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదు. ఆమెకు ఏం మాట్లాడాలో కూడా తెలియకపోవడంతో మంత్రి హరీష్ రావు రెండుకళ్ల సిద్ధాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

రామలింగారెడ్డి భార్య సుజాతను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా సానుభూతి ఓట్లను పొందేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోంది. మరోవైపు హరీష్ రావు ప్రచారంలో భాగంగా తనను చూసి ప్రజలు ఓటేయాలని కోరుతున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే సిద్ధిపేట తరహాలో దుబ్బాకను అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇస్తున్నారు. దీని ద్వారా ప్రజల్లో అభివృద్ధిపై ఆశలు రేపుతూ ఓట్లకు గాలం వేస్తున్నారు. దుబ్బాకను అభివృద్ధి చేసేందుకే తాను ఇక్కడికి వచ్చానంటూ స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

Also Read: ప్చ్‌.. దసరాకు బస్సులు లేనట్లేనా?

ఇక ప్రతిపక్షాలు సైతం హరీష్ రావుకు గట్టి సవాల్ విసురుతున్నాయి. గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం సొంతగూటికి చేరుకున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచాడు. అయితే హరీష్ రావు మాత్రం ఆయన అనుచరులన్నీ టీఆర్ఎస్ చేర్చుకుంటూ అందరికీ షాకిస్తున్నాడు. హరీష్ రావు తన ప్రత్యర్థుల్ని బలహీనం చేసి పోటీలో లేకుండా చేస్తూ విజయం సాధించడం దిట్ట. ప్రస్తుతం దుబ్బాకలోనూ అదే వ్యూహాంతో హరీష్ రావు ముందుకెళుతున్నాయి. అయితే దుబ్బాకలో  హరీష్ రావు వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయనేది వేచి చూడాల్సిందే..!